iDreamPost

చంద్ర‌బాబు కుప్పం నుంచి తీసుకున్నాడు, ఇచ్చిందేమీ లేదు, సీఎం జ‌గ‌న్ ఫైర్

చంద్ర‌బాబు కుప్పం నుంచి తీసుకున్నాడు, ఇచ్చిందేమీ లేదు, సీఎం జ‌గ‌న్ ఫైర్

చంద్ర‌బాబును ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం నుంచే సూటిగా విమ‌ర్శించారు సీఎం జ‌గ‌న్. 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగానే చంద్ర‌బాబు ఉన్నాడ‌ని, అలాంటి నాయ‌కుడు కుప్పం నుంచి త‌న‌కు కావాల్సింది తీసుకున్నాడే త‌ప్ప‌, తిరిగి చేసిందేమీ లేద‌ని జ‌గ‌న్ అన్నారు. కుప్పం లోని అనిమిగానిప‌ల్లిలో ఎర్పాటుచేసిన వైఎస్సార్ చేయూత న‌గ‌దు జ‌మ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు.

కుప్పంను బాబు ఏనాడూ సొంత గ‌డ్డ‌గా భావించ‌లేద‌ని, హైద‌రాబాదే ముద్దు అని భావించాడు. అందుకే అధికారంలోకి వ‌చ్చాక హైద‌రాబాద్ లో ఇంద్ర‌భ‌వ‌నం లాంటి ఇళ్లు క‌ట్టుకున్నాడు. మ‌రి కుప్పంలో? సొంత ఇళ్లుకాదుక‌దా, ఓటుకూడా లేద‌ని, బాబు హైద‌రాబాద్ కు లోక‌ల్, కుప్పానికి నాన్ లోక‌ల్ ని అని ఎద్దేవా చేశారు. క‌నీసం కుప్పం ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో కూడా ఆలోచించ‌లేద‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు.

సంక్షేమ‌ప‌థ‌కాల కోసం ప్ర‌భుత్వం విప‌రీతంగా అప్పులు చేస్తోంద‌న్న విమర్శ‌ల‌ను తిప్పికొట్టిన సీఎం, గ‌త ప‌రిపాల‌న కంటే ఈ ప్ర‌భుత్వం త‌క్కువ అప్పులు చేస్తోంద‌ని, అభివృద్ది మాత్రం ఎక్కువ చేస్తోంద‌ని ప్ర‌క‌టించారు. అప్పుడు దోచుకో..పంచుకో..తీసుకో ద్వారా ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు, టీవీ5, చంద్ర‌బాబు, ఒక ద‌త్త‌పుత్రుడితోపాటు గ్రామాల్లో జ‌న్మ‌భూమి క‌మిటీలు బాగుప‌డ్డారని విమ‌ర్శించారు. ఇప్పుడు త‌మ ప్ర‌భుత్వంలో సంక్షేమం సాధ్య‌మైంద‌న్న సీఎం, అది ప్ర‌జ‌లు గుర్తించాల‌ని కోరారు. ఈ లెక్క‌న చంద్ర‌బాబుది చేత‌కానిత‌నం అనాలా? చేయ‌కూడ‌ద‌నే దుర్భుద్ది అనాలా? అర్ధంకావ‌ట్లేద‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్.

చంద్ర‌బాబు చేత‌కాని నాయ‌కుడ‌ని విమ‌ర్శించిన సీఎం జ‌గ‌న్, 14 ఏళ్లు సీఎంగా ఉండికూడా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో క‌రువు స‌మ్య‌కు ప‌రిష్కారం చూపించ‌లేక‌పోయాడ‌ని, పైగా హంద్రీనావాకు ఆటంకంగా మారారన్నారు. కావాల్సిన వాళ్ల‌కు కాంట్రాక్టులిచ్చి, క‌మిష‌న్ల కోసం క‌క్కుర్తిప‌డ్డార‌ని, కుప్పంకు మంచి నీళ్ళుకూడా తెప్పించ‌లేక‌పోయాడ‌ని, క‌నీసం స‌రైన రోడ్లుకూడా వేయించ‌లేక‌పోయాడ‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు వ‌ల్ల కుప్పం నుంచి నిరోద్యోగులుకూడా త‌ర‌లిపోయార‌ని, చేత‌కాని నాయ‌కుడు ఈ చంద్ర‌బాబు అని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాం. ఆరునెల‌ల్లో హాంద్రీనీవా ప‌నులు పూర్తిచేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆర్డీవో కార్యాలయాన్ని , రామ‌కుప్పంలో విద్యుత్ స‌బ్ స్టేష‌న్ ను ఎర్పాటుచేశాం. ఇంటిగ్రేగెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను కూడా పూర్తిచేశామ‌న్న సీఎం జ‌గ‌న్, ఒకేష‌న‌ల్ కాలేజీని పూర్తిచేశాం. ఇంకా చాలా చేశాం. వీట‌న్నింటిని పూర్తిచేసింది మీ బిడ్డే అని కుప్పం ప్ర‌జ‌ల‌కు గుర్తుచేశారు. ఎమ్మెల్సీగా ఉంటూనే భ‌ర‌త్ నాతో ఇన్నిప‌నులు చేయించాడు. భ‌రత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, మంత్రిని చేస్తా అని సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ ప్ర‌భుత్వం, మీ ప్ర‌భుత్వమ‌ని గుర్తుపెట్టుకోండ‌ని సీఎం జ‌గ‌న్ కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి