iDreamPost

YouTube: రూల్స్ మార్చిన యూట్యూబ్! ఇక మానిటైజేషన్ మరింత ఈజీ..

  • Author Soma Sekhar Updated - 06:21 PM, Wed - 14 June 23
  • Author Soma Sekhar Updated - 06:21 PM, Wed - 14 June 23
YouTube: రూల్స్ మార్చిన యూట్యూబ్! ఇక మానిటైజేషన్ మరింత ఈజీ..

ప్రస్తుత ఆధుని యుగంలో చేతిలో సెల్ ఫోన్ లేనిదే మనిషి ఏపని చేయడం లేదు. అంతగా సెల్ ఫోన్ మనిషి జీవితంలో భాగం అయిపోయింది. ఇక ఆ ఫోన్ లో ఉండే కొన్ని యాప్స్ కైతే మనిషి బానిసై పోయాడు అనే చెప్పాలి. అలాంటి యాప్స్ లో యూట్యూబ్ ఒకటి. బోరుకొడుతుంటే యూట్యూబ్ వీడియో సాంగ్స్ కావాలంటే యూట్యూబ్, కొత్తగా ఏదైనా మూవీ ట్రైలర్ వచ్చిందంటే యూట్యూబ్. అలా రోజుకు లెక్కలేనన్ని సార్లు యూట్యూబ్ ను చూస్తుంటాం మనం. దాంతో ఈ యూట్యూబ్ ను మంచి ఆదాయ వనరుగా మార్చుకుంటూ ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. అలాంటి యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సంస్థ. గతంలో మానిటైజేషన్ కు ఉన్న రూల్స్ ను సరళించింది. దాంతో కొత్తగా వచ్చే కంటెంట్ క్రియేటర్ల పాలిట ఇది వరంలా మారనుంది. ఇంతకి యూట్యూబ్ మార్చిన రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP)కి సంబంధించిన నిబంధనలను సరళించింది. గతంలో ఛానల్ మానిటైజేషన్ కు ఉన్న నిబంధనలను సగానికి సగం తగ్గించింది. చిన్న కంటెంట్ క్రియేటర్లు సైతం మానిటైజేషన్ టూల్స్ పొందేందుకు వీలుగా ఈ నిబంధనలు మార్చింది. గతంలో యూట్యూబ్ లో మానిటైజేషన్ కు అర్హత సాధించాలి అంటే 1000 మంది సబ్ స్క్రైబర్లు, సంవత్సరానికి 4వేల గంటల వ్యూస్ లేదా 3 నెలల్లో కనీసం 90 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలకు అర్హత సాధిస్తేనే ఛానల్ మానిటైజేసన్ అయ్యి డబ్బులు వస్తాయి. తాజాగా ఈ నిబంధనలను సవరించింది. తాజా రూల్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఇకపై 500 మంది సబ్ స్క్రైబర్లు, చివరి 3 నెలల్లో కనీసం మూడు లేదా నాలుగు అంతకంటే ఎక్కువ పబ్లిక్ కంటెంట్ ను అప్ లోడ్ చేసి ఉండాలి. దీనితో పాటుగా 3వేల గంటల వ్యూస్ సంవత్సరంలో ఉండాలి. లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన వారు యూట్యూబ్ మానిటైజేషన్ ప్రొగ్రాంకు అప్లై చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఈ కొత్త రూల్స్ ను మెుదట అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియా దేశాల్లో అమలు చేయనుంది. త్వరలోనే భారత్ తో పాటుగా మిగత దేశాల్లో ఈ రూల్స్ ను అమలు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ లాంటి టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానెల్ మెంబర్ షిప్ వంటి సబ్ స్క్రిప్షన్ టూల్స్ ను కూడా పొందేందుకు వీలుపడుతుంది. ఈ రూల్స్ ను సవరించడం వల్ల చిన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించే వీలు కలుగుతుందని సంస్థ తెలిపింది. ఏదేమైనా ఈ రూల్స్ సరళింపు చిన్న క్రియేటర్ల పాలిట వరం అనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి