iDreamPost

మేడారం జాతర్లో యువతి లక్షల్లో సంపాదన.. జీవితాన్ని మార్చింది!

Woman Earns Lakhs in Medaram Jathaar: తెలంగాణ కుంభమేళగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మొదలైంది. నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది.

Woman Earns Lakhs in Medaram Jathaar: తెలంగాణ కుంభమేళగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మొదలైంది. నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది.

మేడారం జాతర్లో యువతి లక్షల్లో సంపాదన.. జీవితాన్ని మార్చింది!

ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీ ఉత్సవం మేడారం జాతర. ఈ జాతరను తెలంగాణ కుంభమేళగా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమేకాదు.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల్లో తరలి వస్తుంటారు. కానలి నడకన, ఎడ్లంబడ్లు, వాహనాల్లోనే కాదు ఇటీవల హెలికాప్టర్ లోనూ మేడారం జాతరకు భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి కోట్లమంది భక్తులు దర్శించుకోవడానికి వస్తున్నారంటే.. అమ్మవార్ల మహిత్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. రెండేళ్లకొక్కసారి జరిగే మేడారం జాతరలో కోట్ల వ్యాపారం జరుగుతుంది. మేడారం జాతర ఓ మహిళ జీవితాన్నే మార్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మంగా జరిగే ఉత్సవాల్లో ఒకటి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. 1968 నుంచి ప్రభుత్వం మేడారం జాతర ఏర్పాట్లు చేస్తుంది. 1996 లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగతా ప్రకటించిన విషయం తెలిసిందే. మేడారం జాతరలో నాలుగు ముఖ్య ఘట్టాలు ఉంటాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర కొనసాగుతుంది. 23న సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, జంపన్న, గోవింద రాజు గద్దెలపై కొలువైన కోట్ల మందికి దర్శనిమిస్తారు.. 24న చివరిరోజు సాయంత్రం అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు.. దీంతో మేడారం జాతర ముగుస్తుంది. ఇక మేడారం జాతర మొదలైనప్పటి నుంచి ఇక్కడ ఎన్నో రకాల వ్యాపారాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా కొబ్బరి కాయలు, బెల్లం బిజినెస్ బాగా సాగుతుంది. బెల్లాన్ని బంగారంగా అమ్మవారికి సమర్పిస్తుంటారు.

మేడారం జాతర ఓ మహిళ జీవితాన్ని మార్చింది. ఎలా ఆమె జీవితం మారిందో అన్న విషయం ఆమె మాటల్లోనే.. ‘ ఒక రకంగా మేడారం జాతర నా జీవితాన్నే మార్చింది.  నేను మూడు సంవత్సరాల నుంచి కొబ్బరి కాయల బిజినెస్ చేస్తున్నాను. లాభాలు బాగానే ఉంటాయి.. ఈ బిజినెస్ మాకు బాగా సెట్ అయ్యింది. అమ్మవారి దీవెనల వల్ల మా వ్యాపారం బాగా సాగుతుంది. కొబ్బరి కాయలు ఆంధ్ర, తమిళ నాడు నుంచి తెస్తుంటాం. ఇక్కడ కొబ్బరి కాయలు రూ.50 లకు అమ్ముతుంటాం. దేవస్థానం ఖరీదు రూ.40 అయితే.. అమ్మవారికి కుంకుమ, పసుపు తో కలిపి అమ్ముతాం కనుక 50 రూపాయలు తీసుకుంటాం. ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నందుకు గ్రామ పంచాయితీకి 28 రోజులకు గాను ప్రతిరోజూ లక్ష రూపాయల చొప్పున రూ.28 లక్షలు చెల్లిస్తాం. పోయిన సారి మేడారం జాతరకు మంచి లాభాలు వచ్చాయి. ఈ వ్యాపారంలో కొన్నిసార్లు నష్టాలు కూడా రావొచ్చు.   అందుకే ప్రతిసారి మేడారం జాతరకు వచ్చి ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తాం. మేడారం జాతర పుణ్యమా అని ఎంతోమంది వ్యాపారులు బతుకుతున్నారు’ అని తెలిపింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి