P Krishna
ఈ మద్య కాలంలో కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురి కావడం.. ఆ క్షణంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయం కుటుంబ సభ్యులను కన్నీటిపాలు చేస్తున్నాయి.
ఈ మద్య కాలంలో కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురి కావడం.. ఆ క్షణంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయం కుటుంబ సభ్యులను కన్నీటిపాలు చేస్తున్నాయి.
P Krishna
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఎదుటివారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు తెగబడటం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఏడాది గడవకముందే.. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వివాహేతర కారణాల వల్ల ఒకరినొకరు చంపుకోవడం లాంటివి చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో పెద్దలు, పోలీసులు ఎంతగా కౌన్సిలింగ్ ఇచ్చినా.. క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. పెళ్లైన నెలరోజుల్లోనే భార్యాభర్తలు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
అంతర్వేది సముద్రంలో యువజంట గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపుతుంది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో సముద్ర స్థానాలకు భక్తులు భారీగా చేరుకున్నారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా జువ్లపలాలెం గ్రామానికి చెందిన నవ దంపతులు రేలంగి లక్ష్మినారయణ, గాయత్రీలు వచ్చారు. ఏమైందో తెలియదు కానీ.. భార్యాభర్తలు తమ సెల్ ఫోన్ సముద్రపు ఒడ్డున వదిలేసి.. దంపుతులిద్దరూ చేతులకు చున్నీ కట్టుకొని మరీ సముద్రంలోకి వెళ్లి గల్లంతరయ్యారు. అందరూ చూస్తుండగానే.. నవ దంపతులు అలా చేయడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. ప్రస్తుతం సఖినేటిపల్లి సముద్రం వద్ద గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.