iDreamPost
android-app
ios-app

ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి..

  • Published May 03, 2024 | 9:13 PM Updated Updated May 03, 2024 | 9:13 PM

కొడుకు ప్రేమ వ్యవహారం కన్న తల్లికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఏతల్లికి రాని ఇబ్బందిని ఎదుర్కొన్నది. కొడుకు ఓ యువతిని లేపుకుపోవడంతో తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు యువతి కుటుంబ సభ్యులు.

కొడుకు ప్రేమ వ్యవహారం కన్న తల్లికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఏతల్లికి రాని ఇబ్బందిని ఎదుర్కొన్నది. కొడుకు ఓ యువతిని లేపుకుపోవడంతో తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు యువతి కుటుంబ సభ్యులు.

  • Published May 03, 2024 | 9:13 PMUpdated May 03, 2024 | 9:13 PM
ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి..

ఇటీవల కొన్ని ప్రేమ వ్యవహారాలు దారుణాలకు దారితీస్తున్నాయి. ప్రేమ పేరుతో జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. ప్రేమించిన యువతి మోసం చేసిందని చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఎలాగైనా ప్రేమను దక్కించుకోవాలని దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో ఓ యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే కర్ణాటకాలో మరో దారుణం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ప్రేమించుకున్న యువతీయువకులకు ఏ సమస్యా తలెత్తలేదు. వీరి కారణంగా యువకుడి తల్లికి ఘోర అవమానం జరిగింది. తన కొడుకు వారి కూతురును లేపుకెళ్లిపోయాడని ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

నేటి తరం యువత ప్రేమ మోజులో పడి తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు. పేరెంట్స్ పరువును బజారుపాలు చేస్తున్నారు. పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేస్తూ తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. ఇదే రీతిలో ఓ యువకుడు ఏ తల్లికిరాని కష్టాన్ని తన తల్లికి వచ్చేలా చేశాడు. దీనికి గల కారణం ఆ యువకుడు ఓ యువతితో ప్రేమాయణం నడపడమే. ప్రేమించిన యువతిని తీసుకెళ్లడంతో ఆగ్రహించిన యువతి కుటుంబీకులు అతడి తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్నాటకలోని హవేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

అరెమల్లాపుర గ్రామానికి చెందిన మంజునాథ్, పూజ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ససేమీరా అనడంతో పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 29న వారిద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. మంజునాథ్‌ ఇంటికి వచ్చి నానా రచ్చ చేశారు. యువకుడి తల్లి హనుమవ్వ కోమ్‌ను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకు వచ్చి కనికరం లేకుండా ప్రవర్తించారు. ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు హనుమవ్వను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. యువతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet