iDreamPost

కొత్తిమీర వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??

కొత్తిమీర వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??

కొత్తిమీర మనకు విరివిగా దొరుకుతుంది. లేదా మనమైనా మన ఇంటిలో పెంచుకోవచ్చు. ధన్యాలను నలిపి ఒక చిన్న కుండీలో దగ్గర దగ్గరగా వేస్తె కచ్చితంగా పదిహేను రోజులకు కొత్తిమీర వస్తుంది. కొత్తిమీరను అన్ని రకాల కూరలలో, రసం, చారు, సాంబారు ఇంకా చాలా వాటిల్లో గార్నిష్ లా వాడతారు. కొత్తిమీరతో చట్నీ, మరియు నిలువ పచ్చడి కూడా తయారు చేస్తారు. కొత్తిమీరను పచ్చిగా తిన్నా మంచిదే.

కొత్తిమీర మంచి వాసనను కలిగి ఉంటుంది. కొతిమీరలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. కొత్తిమీర మన శరీరంలో హానికర కొవ్వు పదార్థాల స్థాయిని తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిని పెంచుతుంది. కొత్తిమీర తలనొప్పి, మానసిక అలసట, ఒత్తిడిని, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కంటికి సంభందించిన వ్యాధులను రాకుండా ఉండేలా చేస్తుంది. కొత్తిమీర మన శరీరంలో రక్తంలో చక్కర స్థాయిని తగ్గించి మధుమేహాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

కిడ్నీలో రాళ్లను కరిగించడానికి ఉపయోగపడుతుంది. పెద్దలలో యూరినరీ ఇన్స్పెక్షన్ లను తగ్గించడంలో సహాయపడుతుంది. కొత్తిమీరను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన గుండెకు సంభందించిన సమస్యలు తగ్గుతాయి మరియు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. మెదడు వాపు వంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రసాయనాలు కలిపిన ఆహారాన్ని తింటే వచ్చే ఇన్స్పెక్షన్ల నుండి కూడా కొత్తిమీర కాపాడుతుంది. అందుకే మనం తినే ఆహారంలో కొత్తిమీర వచ్చినప్పుడు తీసి పడేయకుండా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి