iDreamPost

లోన్ లేకుండా, పైసా ఖర్చు పెట్టకుండా ఇల్లు కట్టుకోండిలా!

మీరు సొంతిల్లు లేదని బాధ పడుతున్నారా? స్థలం ఉండి కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోకుండా.. పైసా ఖర్చు లేకుండానే సొంతిల్లు రెడీ అవుతుంది. ఎలా అంటే?

మీరు సొంతిల్లు లేదని బాధ పడుతున్నారా? స్థలం ఉండి కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోకుండా.. పైసా ఖర్చు లేకుండానే సొంతిల్లు రెడీ అవుతుంది. ఎలా అంటే?

లోన్ లేకుండా, పైసా ఖర్చు పెట్టకుండా ఇల్లు కట్టుకోండిలా!

స్థలం కొనడం ఒక ఎత్తు అయితే అందులో ఇల్లు కట్టడం మరొక ఎత్తు. సిటీలో ఇల్లు కట్టడం అంటే మహా కష్టం. కిందా మీదా పడి కష్టపడి స్థలం కొనేసరికే తల ప్రాణం తోకకు వస్తుంది. ఇక ఇల్లు కట్టాలంటే అమ్మో నరకమే. అందులోనూ స్థలానికే డబ్బులైపోతే ఇక ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడ నుంచి వస్తాయి. బ్యాంకు లోన్ తీసుకుందామన్నా ఆల్రెడీ స్థలం కోసం తీసుకునే ఉంటారు. ఇక మళ్ళీ ఇల్లు కట్టుకోడానికి అంటే ఇవ్వరు. తీసుకున్నా వాయిదాలు కట్టలేరు. ఇలాంటప్పుడు మీకు ఈ ఐడియా బాగా ఉపయోగపడుతుంది. బ్యాంక్ లోన్ తీసుకోనవసరం లేదు. పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ మీరు అనుకున్నట్టు మీ ఇల్లు పూర్తవుతుంది. అదెలాగో చూసేయండి.

సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకోసం అహర్నిషలు శ్రమిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో స్థలాల ధరలు చూస్తే కళ్లు తేలేయాల్సిందే. ఇక కిందా మీద పడి ఓ స్థలాన్ని కొనుక్కోని ఇల్లు నిర్మించుకుందామంటే తల ప్రాణం తోకకొస్తుంది. ఓ వైపు పెరుగుతున్న ఖర్చులు, ఇంటి అవసరాలు ఇవన్నీ కలగలిపి వచ్చే సంపాదన వాటికే ఖర్చైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడం గగనమైపోతోంది. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న ఇలాంటి వారికి చక్కటి మార్గం అందుబాటులో ఉంది. మీరు స్థలం కొనుక్కోని బిల్డర్ ను సంప్రదిస్తే చాలు. మీరు కలలుగన్న ఇల్లును బిల్డర్ నిర్మించి అందిస్తారు. దీని కోసం మీరు అదనంగా ఏం ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీరు చేయాల్సిందల్లా మీ స్థలంలో బిల్డర్ ఫ్లాట్స్ నిర్మించుకునేలా అనుమతి ఇవ్వడమే.

బిల్డర్స్ మీ అనుమతితో మీ స్థలంలో తన సొంత డబ్బులతో 4 లేదా 5 ఫోర్లతో ఇల్లు కడతాడు. అయితే ఆ కట్టినటువంటి ఫ్లోర్లలో మీకు రెండు లేదా మూడు ఫ్లోర్లను కేటాయించి మిగతావి తను అమ్ముకుంటాడు. ఎందుకంటే స్థలం మీదే కావొచ్చు.. కానీ ఇంటి నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది మాత్రం బిల్డరే కదా. అందుకే కొన్ని ఫ్లోర్లను తను తీసుకోని ఇతరులకు అమ్ముకుంటాడు. ఈ పద్దతిలో అదనపు ఆర్థిక భారం పడకుండా మీ సొంతింటి కల నెరవేరుతుంది. అంతే కాకుండా మీకు కేటాయించిన ఆ రెండు లేదా మూడు ఫ్లోర్లలో రెంట్ కు కూడా ఇచ్చుకోవచ్చు. దీంతో మీకు అద్దె రూపంలో అదనపు ఆదాయం కూడా సమకూరుతోంది. ఒక వేళ మీరు స్థలాన్ని లోన్ తీసుకుని కొన్నట్లైతే ఆ రుణాన్ని అద్దె మీద వచ్చే ఆదాయంతో సులభంగా తీర్చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మరి స్థలం ఉండి బిల్డర్ సాయంతో సొంతింటి కలను నెరవేర్చుకునే ఈ విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి