iDreamPost

జనసేనానికి “అన్నా” ఆఫర్!

జనసేనానికి “అన్నా” ఆఫర్!

నిజమే కాకపోతే అన్న ఆఫర్ కాదు అన్నా ఆఫర్.. అదేనండీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్ రూపంలో ఇచ్చిన ఆఫర్. ఎందుకంటే పవన్ మాట్లాడితే నాకు శక్తి ఉంది..నేను దేనినైనా ఎదుర్కునే ధైర్యం ఉంది అంటుంటారు. అందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విసిరిన సవాల్ ఓ గొప్పఅవకాశం అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే అసెంబ్లీలో ఉంటే ప్రజా సమస్యలను ఎత్తి చూపి వాటిపరిష్కారానికి ఇంకా బాగా కృషిచేయొచ్చు. ఎన్నికలకు ఇప్పట్లో అవకాశాలు లేవు. గత ఎన్నికల్లో ఓటమికి కారణం డబ్బులు పంచలేదు అంటున్నారు జనసైనికులు. ఈసారి ఒకటే నియోజక వర్గం కాబట్టి , జనసేనాని డబ్బులు పంచకుండా,ఇతరులను పంచనీయకుండా సైనికులను కాపలా పెట్టి రంగంలోకి దిగే ఛాన్స్ అన్నాఇచ్చారంటున్నారు పరిశీలకులు.

జనసేన కార్యకర్త వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు తానే కారణమని ఆరోపిస్తున్న పవన్ కల్యాణ్ అందుకు ఆధారాలు చూపించగలరా? అని ప్రశ్నిస్తున్నారు రాంబాబు. రాజకీయాల్లో ఓట్లకోసం దిగజారే వ్యక్తిని కానని జనసేనాని చాలాసార్లు వాగృచ్చారు. అదే నిజమైతే వెంగయ్యనాయుడు ఆత్మహత్యకు తానే కారమణి నిరూపించాలని అన్నా రాంబాబు సవాల్ చేస్తున్నారు. అందుకోసం తానే రాజీనామా చేసి వస్తానని, బై ఎలక్షన్ వస్తే మా నాయకుడు జగన్ కూడా ప్రచారానికి రారని… ఆయన ఫొటో, దివంగత వైఎస్సార్ ఫొటో పెట్టుకుని నేనే ప్రచారం చేసుకుంటాననిస గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజాతీర్పు కోరదామని, తద్వారా తేల్చుకుందామని, ఒకవేళ పవన్ గెలిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని, ఒకవేళ ఆయన ఓడితే జనసేన పార్టీని మూసేస్తారా అని అన్నా రాంబాబు సవాల్ విసురుతున్నారు.

అదే సమయంలో వెంగయ్యనాయుడుతో తనకు ఎలాంటి వివాదం లేదని, పవన్ కల్యాణ్ శవరాజకీయాలు చేయడం మానుకోవాలని రాంబాబుహితవు పలికారు. అంటే రాంబాబు సవాల్ ప్రకారం పవన్ శవరాజకీయం చేస్తున్నారు.. పవన్ ఆరోపణ ప్రకారం వెంగయ్య ఆత్మహత్యకు ఎమ్మెల్యే రాంబాబు కారణం. మరి ఇందులో ఏది నిజం? రాజకీయాల్లో ఇవి కామనే అనుకోవాల్సిందే. కాని జనసేనాని అలాకాదుకదా రాజకీయాల్లో ప్రత్యేకం. కేవలం ప్రశ్నించడం,నిజాలు చప్పడమే ఆయన నైజం కదా..అలాంటప్పుడు తాను చేసింది ఆరోపణ కాదు, నేను శవరాజకీయం చేయడం లేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు ఉంది.
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఎమ్మెల్యే రాంబాబు చాలా నిజాయితీగా ఓ నిజం చెప్పారు..తనకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు గౌరవం ఉందన్నారు. తాను అసెంబ్లీకి వెళ్లేందుకు బాటలు వేసిన తమపట్ల గౌరవం ప్రకటించారు. అందుకే ఆగౌరవంతోనే తాను రాజీనామా చేస్తానని, ఉపఎన్నికలో ఇద్దరం పోటీ చేసి,ప్రజాతీర్పు కోరదామని మరీ సవినయంగా రాంబాబు ఆఫర్ ఇచ్చారు.

ఎంతైనా రాంబాబు రాజకీయ నాయకుడు కదా.. పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఎంత మంది తో యుద్ధం చేశారని, ఎంత మందిని ప్రశ్నించారని అడిగారు. మమ్మల్ని వ్యక్తి గతంగా తిట్టడానికా , గుడ్డలూడతీసి కొట్టడానికా  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిందంటూ రాంబాబు ప్రశ్నించారు. సో ఎవరకీ భయపడని, ప్రజలకోసం ఎంతపోరాటానికైనా సిద్ద మనే పవన్, ప్రస్తుతం అన్నారాంబాబు ఇచ్చిన మెగా ఆఫర్ స్వీకరించి, తానేంటో నిరూపించుకోవాల్సి అవసరం ఉంది. మరి పవన్ గారు ఏమంటారో ? ఆఫర్ ను అదేనండి అన్నా..సవాల్ ను స్వీకరిస్తారా? లేక అంతా తూచ్..అనుకోమంటారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి