iDreamPost

జగన్ ను గుండెల్లో పెట్టుకున్న గోదావరి

జగన్ ను గుండెల్లో పెట్టుకున్న గోదావరి

విభజనకు ముందున్న 23 జిల్లాలు కావొచ్చు, విడిపోయాక ఉన్న 13 జిల్లాలే కావొచ్చు.. కానీ రాష్ట్రంలో రాజకీయాధికారం పొందాలంటే ఉభయగోదావరి జిల్లాల ప్రజల ఆశీస్సులు ఉండాలన్నది రాజకీయ నమ్మకం. ఇప్పటి వరకు కూడా ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ రెండు జిల్లాల్లోనూ ఆధిక్యం చాటుకున్న పార్టీలే రాష్ట్రంలో అధికారం పీఠమెక్కడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఇదే విధమైన సెంటిమెంట్‌ను ఈ రెండు జిల్లాలు నిలుపుకున్నాయి.

ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల్లో భరోసా కల్పించిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు అండగా నిలిచాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ 34 అసెంబ్లీ స్థానాలకు గాను 2014లో కేవలం అయిదు స్థానాలకు మాత్రమే పరిమితమైన వైఎస్సార్‌సీపీ, 2019 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా 27 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దీనిని బట్టే ఈ రెండు జిల్లాల ప్రజలు ఏ స్థాయిలో జగన్‌కు అండగా నిలిచారో అర్ధం చేసుకోవచ్చు. ఉభయగోదావరి జిల్లాల ప్రజా మద్దతు, సంకల్ప యాత్రలోనే పూర్తిగా ప్రస్ఫుటమైంది. పాదయాత్ర సాగిన ప్రతి నియోజకవర్గంలోనూ జనం లక్షలుగా పోగైన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిందే. వచ్చిన జనం జగన్‌ ప్రసంగం అయ్యేంత వరకు ఎక్కడివారక్కడే నిలబడిపోవడాన్ని కూడా అప్పట్లో పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావించేవారు.

తూర్పు గోదావరిలో 2014లో 5 స్థానాలు మాత్రమే సాధించిన వైఎస్సార్‌సీపీ 2019లో మాత్రం 14 స్థానాలతో తన సత్తాను చాటుకుంది. పశ్చిమగోదావరిలో 2014లో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. అయితే 2019లో మాత్రం అనూహ్యం 13 స్థానాలు పొందింది. టీడీపీని కేవలం రెండు స్థానాలకే పరిమితం చేసింది. 2014లో జనసేన పార్టీ ద్వారా పవన్‌కళ్యాణ్‌ టీడీపీకి నేరుగా తోడ్పాటును అందించడం కూడా అప్పట్లో ఆ పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి. 2019లో చంద్రబాబును, పవన్‌ కళ్యాణ్‌ను కూడా ఉభయగోదావరి జిల్లాల ప్రజలను పెద్దగా లెక్కలోకి తీసుకోకపోవడం ఇక్కడ గమనార్హం.

ఈ రెండు జిల్లాల ప్రజలకు 2014లో చంద్రబాబును నమ్మి మోసపోయామనే భావన ఎంత ఎక్కువగా ఉందో అదే సమయంలో వైఎస్‌ జగన్‌ను అంత ఎక్కువగా నమ్మారనే చెప్పాలి. కాపు రిజర్వేషన్ల అంశం, రైతు, డ్వాక్రా రుణ మాఫీ తదితర అంశాల్లో చంద్రబాబు చేసిన నమ్మక ద్రోహాన్ని ఉభయగోదావరి జిల్లాల ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేకపోయారు. రాజకీయంగా ఎంతో చైతన్యంతో ఉండే ఈ రెండు జిల్లాల్లోనూ గ్రామీణ స్థాయిలో చంద్రబాబు మోసం బలంగా నాటుకుపోయింది. రైత్వారీ జిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదావరుల్లో రైతు రుణమాఫీ పేరిట చంద్రబాబు చేసిన హంగామా రైతుల్లో తీవ్ర నైరాశ్యాన్ని నిపింది. పోలవరం ప్రాజెక్టు గిమ్మిక్కులు కూడా ప్రజలకు పూర్తిగా అర్ధమైపోయాయి.

అదే సమయంలో తాను చేయగలిగేది మాత్రమే చెబుతానని, ఓట్లకోసం ప్రజలను మభ్యపెట్టనని ప్రకటించిన వైఎస్‌ జగన్‌ను ప్రసంగాలను పూర్తిగా విశ్వసించారు. నమ్మి, అండగా నిలిచారు. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదని స్పష్టంగా చెప్పారు. రుణ మాఫీ మాయలు చేయకుండా తాను చేయగలిగింది మాత్రమే ప్రకటించడం ఇక్కడి ప్రజల్లో జగన్‌ పట్ల నమ్మకాన్ని పెంచింది. సీయంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉభయగోదావరిజిల్లాలకు ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన కొడుగా జగన్‌ చేస్తానని చెబుతున్న హామీల పట్ల ప్రజలు బేషరతుగా నమ్మారు. దీంతో ఈ రెండు జిల్లాల చరిత్రలోనూ మరో ఘట్టానికి తెరలేచింది. అద్భుతమైన విజయాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. రాష్ట్రంలో 151 సీట్లతో తిరుగులేని విజయానికి తమ వంతు తోడ్పాటును ఉభయగోదావరుల ప్రజలు జగన్‌కు అందించారు.

రెండు జిల్లాలకు తగిన ప్రాధాన్యం..

తనకు అండగా నిలిచిన ఈ రెండు జిల్లాల ప్రజలకు సీయం వైఎస్‌ వైఎస్‌ జగన్‌ అండగా నిలిచి తన పట్ల ప్రేమను చూపిన ప్రజలకు అంతే ప్రేమను పంచుతున్నారు. కేబినెట్‌లో కీలకమైన పదవులను ఈ రెండు జిల్లాలకు చెందిన పలువరు నేతలకు అప్పగించారు. కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూమ్, ఆళ్ల నాని, శ్రీరంగనాథరాజు, తానేటి వనితలకు కీలకమైన కేబినెట్‌ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అలాగే రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌కు పార్లమెంటరీ చీఫ్‌విప్‌ పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర కాపుకార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాకు అవకాశం ఇచ్చారు. అలాగే రాష్ట్రస్థాయిలో పలు నామినేటెడ్‌ పోస్టుల్లో కూడా ఉభయగోదావరి జిల్లాలకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. వ్యవసాయాధారిత జిల్లాలైన ఈ రెండు జిల్లాలే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యాన రంగాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి