iDreamPost

Yatra 2 Movie: యాత్ర 2 టీజర్ సూపర్ అప్‌డేట్‌ మీకోసం..!

యాత్ర సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు మహి వి రాఘవ మరోసారి యాత్ర 2 అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే వచ్చే నెలలో యాత్ర 2 విడుదల అవ్వబోతుంది. యాత్ర 2 టీజర్‌ అప్‌డేట్‌ వచ్చింది.

యాత్ర సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు మహి వి రాఘవ మరోసారి యాత్ర 2 అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే వచ్చే నెలలో యాత్ర 2 విడుదల అవ్వబోతుంది. యాత్ర 2 టీజర్‌ అప్‌డేట్‌ వచ్చింది.

Yatra 2 Movie: యాత్ర 2 టీజర్ సూపర్ అప్‌డేట్‌ మీకోసం..!

2019 లో వచ్చిన యాత్ర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రను చూపించిన దర్శకుడు మహి వి రాఘవ ఇప్పుడు అదే టైటిల్ తో జగన్ పాద యాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. యాత్ర 2 గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు షూటింగ్‌ ను ముగించినట్లుగా తెలుస్తోంది. యాత్ర 2 లో వైఎస్ జగన్‌ పాత్రను కోలీవుడ్ స్టార్ నటుడు జీవా చేస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమాలో వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి మళ్లీ కనిపించబోతున్నాడా అనేది ఆసక్తిగా మారింది. తాజాగా టీజర్‌ అప్డేట్‌ ను చిత్ర యూనిట్ సభ్యులు ఇవ్వడం జరిగింది.

జనవరి 5వ తేదీన యాత్ర 2 టీజర్ ను ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీన ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు,  యాత్ర 2 పై ఉన్న ఆసక్తి పెంచే విధంగా టీజర్ ఉంటుందని లీక్ అందుతోంది. యాత్ర 2 టీజర్ లాంచ్ కి సంబంధించిన పోస్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు ఉన్నాయి. అవేంటి అంటే.. నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియక పోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ జగన్‌ కి సంబంధించిన వ్యాఖ్యలు ఉండటంతో వైకాపాకు చెందిన నేతలు మరియు మీడియా వర్గాల్లో ఆసక్తి రేకెత్తుతోంది. ఈ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు వైకాపా ఫ్యాన్స్ సైతం.

యాత్ర 2 సినిమా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారబోతుందని రాజకీయ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. జగన్‌ ఎలా పాద యాత్ర చేశాడు, ఆ పాద యాత్ర అతడి రాజకీయ ఎదుగుదలకు ఎలా సాయపడింది అనేది సినిమా కథగా తెలుస్తోంది. రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా టీజర్‌ ను కట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. మమ్ముట్టి అప్డేట్‌ ను సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పోస్ట్‌ చేయడంతో యాత్ర 2 లో కూడా ఆయన ఉంటాడని తెలుస్తోంది. మొత్తానికి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా యాత్ర 2 ఉంటుందని మీరు భావిస్తున్నారా అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి