iDreamPost

ఆ విషయం రోహిత్ ను అడుగు.. జైస్వాల్ కు కుంబ్లే స్పెషల్ రిక్వెస్ట్!

Yashasvi Jaiswal-Anil Kumble: టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ కు ఓ కీలకమైన సలహా ఇచ్చాడు భారత లెజెండ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. ఆ విషయం రోహిత్ ను అడుగు అంటూ కుంబ్లే అతడిని రిక్వెస్ట్ చేశాడు.

Yashasvi Jaiswal-Anil Kumble: టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ కు ఓ కీలకమైన సలహా ఇచ్చాడు భారత లెజెండ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. ఆ విషయం రోహిత్ ను అడుగు అంటూ కుంబ్లే అతడిని రిక్వెస్ట్ చేశాడు.

ఆ విషయం రోహిత్ ను అడుగు.. జైస్వాల్ కు కుంబ్లే స్పెషల్ రిక్వెస్ట్!

యశస్వీ జైస్వాల్.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పరుగులవరద పారిస్తున్నాడు ఈ యంగ్ క్రికెటర్. మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో రెండు డబుల్ సెంచరీలు చేసి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు కొడుతూ.. దూసుకెళ్తున్నాడు. దీంతో జైస్వాల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజాలు. అయితే టీమిండియా లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే మాత్రం పొగడ్తలు కురిపించకుండా.. ఓ కీలక సలహా ఇచ్చాడు. మరి ఆ సలహా ఏంటో తెలుసుకుందాం.

యశస్వీ జైస్వాల్.. ఇంగ్లాండ్ బౌలర్లను దంచికొడుతూ పరుగులవరదపారిస్తున్నాడు. మూడు టెస్టుల్లో 109 సగటుతో 545 రన్స్ చేసి.. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ లో జైస్వాల్ ను చూసిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతడికి ఓ సలహా ఇచ్చాడు. ఈ టెస్ట్ మూడోరోజు ఉదయం ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా.. జైస్వాల్ బౌలింగ్ చేయడాన్ని అనిల్ కుంబ్లే చూశాడు. మూడో టెస్ట్ ముగిసిన తర్వాత జియో సినిమాలో జైస్వాల్ తో మాట్లాడిన కుంబ్లే.. అతడికి ఓ సలహా ఇచ్చాడు.

“నీలో సహజమైన లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. పైగా అశ్విన్ కూడా అందుబాటులో లేడు. నువ్వు ధైర్యంగా వెళ్లి కెప్టెన్ రోహిత్ శర్మను బౌలింగ్ ఇవ్వు అని అడుగు. ఎప్పుడూ కూడా నువ్వు నీ లెగ్ స్పిన్ ను వదుకోకు. ఎందుకంటే? అది ఎప్పుడు.. ఎలా ఉపయోగపడుతుందో నీకు తెలీదు. రోహిత్ ను కొన్ని ఓవర్లు ఇవ్వమని చెప్పు పర్లేదు. ఇక నీ బ్యాటింగ్ అద్భుతం” అంటూ యంగ్ ప్లేయర్ ను ప్రశంసించాడు. ఇక కుంబ్లే మాటలకు జైస్వాల్ ఈ విధంగా స్పందించాడు..

“రోహిత్ ముందుగానే నాకో విషయం చెప్పాడు. ఈ సిరీస్ లో ఎప్పుడైనా బౌలింగ్ చేయాడానికి సిద్ధంగా ఉండని సూచించాడు. అందుకే నేను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అవకాశం వస్తే.. నా బౌలింగ్ సత్తా చూపెడతా” అంటూ జైస్వాల్ బదులిచ్చాడు. కాగా.. అతడు ఇప్పటి వరకు టెస్టుల్లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. కానీ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ 2023లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ వేశాడు. మరి జైస్వాల్ బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ కూడా చూడాలని ఎంతమంది అనుకుంటున్నారో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి