iDreamPost

భారత్‌పై విజయంతో వరల్డ్‌ కప్స్‌ కౌంట్‌ను 20కి పెంచుకున్న ఆస్ట్రేలియా!

  • Author singhj Published - 04:21 PM, Mon - 20 November 23

టీమిండియాపై ఫైనల్ మ్యాచ్​లో విక్టరీతో వరల్డ్‌ కప్స్ కౌంట్​ను 20కి పెంచుకుంది ఆస్ట్రేలియా. ఒక కప్పు సాధిస్తేనే గొప్ప అని ఫీలయ్యే చోట ఏకంగా ఇరవై ట్రోఫీలు సాధించడం అంటే మాటలా!

టీమిండియాపై ఫైనల్ మ్యాచ్​లో విక్టరీతో వరల్డ్‌ కప్స్ కౌంట్​ను 20కి పెంచుకుంది ఆస్ట్రేలియా. ఒక కప్పు సాధిస్తేనే గొప్ప అని ఫీలయ్యే చోట ఏకంగా ఇరవై ట్రోఫీలు సాధించడం అంటే మాటలా!

  • Author singhj Published - 04:21 PM, Mon - 20 November 23
భారత్‌పై విజయంతో వరల్డ్‌ కప్స్‌ కౌంట్‌ను 20కి పెంచుకున్న ఆస్ట్రేలియా!

క్రికెట్​లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వరల్డ్ కప్ సాధించాలనే కల ప్రతి ఒక్క ప్రొఫెషనల్ ప్లేయర్​కు ఉంటుంది. కెరీర్ ఎండ్ అయ్యే లోపు ఒక్కసారైనా కప్పును ముద్దాడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. అందుకోసం తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. ప్రపంచ కప్ నెగ్గిన టీమ్​లో ఉండాలనే కోరికతో కెరీర్​ను పొడిగించుకున్న వారూ ఉన్నారు. మెగా టోర్నీలో చెత్తాటతో జెంటిల్మన్ గేమ్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న ఆటగాళ్లూ ఉన్నారు. దీన్ని బట్టే క్రికెటర్ల లైఫ్​లో వరల్డ్ కప్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. కప్పు గెలిచిన జట్టుకు స్వదేశంలో దక్కే స్వాగతం, అభిమానుల నుంచి వచ్చే ప్రశంసలు, అవార్డులు, రివార్డులకు లెక్కే ఉండదు.

టీ20ల్లో వరల్డ్ కప్, టెస్టుల్లో ఛాంపియన్​షిప్స్ ఇస్తున్నా.. వన్డే ప్రపంచ కప్ ముందు ఏదీ సాటిరాదనే చెప్పాలి. సంప్రదాయ టెస్టులకు, అధునాతన టీ20లకు మధ్య ఇరుసులా ఉంటోంది 50 ఓవర్ల ఫార్మాట్. ఆటగాళ్ల ఫిట్​నెస్​, టెక్నిక్స్, క్వాలిటీ, టాలెంట్​కు ఈ ఫార్మాట్ రియల్ ఛాలెంజ్ విసురుతోంది. అయితే వన్డే మ్యాచుల నిడివి ఎక్కువ కావడంతో చాలా క్రికెటింగ్ నేషన్స్ ఈ తరహా టోర్నీలు ఆడటం తగ్గించుకున్నాయి. ఫ్యూచర్​లో వన్డేలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. అయినా ఈసారి వరల్డ్ కప్ అందర్నీ ఆకట్టుకుంది. వ్యూయర్​షిప్ పరంగానూ కొత్త రికార్డులు సృష్టించింది. ఆస్ట్రేలియా, భారత్ లాంటి టాప్ టీమ్స్ ఫైనల్స్​కు వెళ్లడం కూడా టోర్నీ హిట్టవ్వడం వెనుక ఒక కారణంగా చెప్పొచ్చు.

ఎంతో ఇంట్రెస్టింగ్​గా సాగిన వరల్డ్ కప్​ను ప్యాట్ కమిన్స్​ నేతృత్వంలోని ఆసీస్ టీమ్ గెలుచుకుంది. ఎవ్వరూ ఎక్స్​పెక్ట్ చేయని విధంగా దాదాపు మ్యాచ్​ను వన్​సైడ్​గా నెగ్గింది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, షమి-బుమ్రా ఫస్ట్ స్పెల్ టైమ్​లో తప్పితే మ్యాచ్ మొత్తం కంగారూలదే పెత్తనం నడిచింది. మొత్తానికి టీమిండియాకు షాకిచ్చి ఆరో ప్రపంచ కప్​ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఓవరాల్​గా చూసుకుంటే క్రికెట్ చరిత్రలో.. ఆసీస్​కు ఇది 20వ వరల్డ్ కప్ అనే చెప్పాలి. పురుషుల, మహిళల క్రికెట్​లో కలుపుకొని ఇది వాళ్లకు ఇరవయ్యో మెగా కప్పు. 1987, 1999, 2003, 2007, 2015 ఎడిషన్లలో ప్రపంచ కప్​ను కైవసం చేసుకుంది కంగారూ టీమ్. ఇప్పుడు మరోమారు కప్పును చేతబట్టి రికార్డు సృష్టించింది.

వన్డే ఫార్మాట్​లో ఆస్ట్రేలియా మెన్స్ టీమ్​కు ఇది ఆరో వరల్డ్ కప్ కావడం విశేషం. ఈ జట్టు టీ20ల్లోనూ ఒకసారి కప్పును ఎగరేసుకుపోయింది. 2021లో ఆసీస్ పొట్టి ఫార్మాట్​ కప్పును నెగ్గింది. మరో రెండేళ్ల గ్యాప్​లోనే వన్డే వరల్డ్ కప్-2023ని సొంతం చేసుకుంది. దీన్ని బట్టే ఆ టీమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో ఎంత బాగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బిగ్ టోర్నమెంట్స్​లో ఫైనల్​కు చేరుకుందో కంగారూ జట్టును ఆపడం అంత ఈజీ కాదు. ఫైనల్​కు క్వాలిఫై అయితే కప్పు తీసుకొనే ఇంటికి వెళ్లాలనే కసి వారిలో కనిపిస్తుంది. ప్రెజర్ తీసుకోకుండా అపోజిషన్ టీమ్స్​ను ఒత్తిడిలోకి నెట్టడం వారికి వెన్నతో పెట్టిన విద్యలా మారింది. ఫైనల్ మ్యాచ్ అంటేనే కొత్త స్ట్రాటజీలతో వచ్చి ప్రత్యర్థులను పడగొట్టడం అలవాటుగా మారింది. ఈసారి కూడా అలాగే వచ్చి రోహిత్ సేనను ఓడించింది. మరి.. ఆసీస్ రికార్డు స్థాయిలో 20వ వరల్డ్ కప్​ను సొంతం చేసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఫైనల్లో టీమిండియా ఓటమి! మళ్లీ అందరికీ ధోని ఎందుకు గుర్తొస్తున్నాడు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి