iDreamPost

రోహిత్ సెన్సేషనల్ కామెంట్స్.. బిగ్ మ్యాచ్​ల్లో అతడు కీలకమంటూ..!

  • Author singhj Published - 08:10 PM, Fri - 20 October 23

బంగ్లాదేశ్​తో మ్యాచ్​ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ఒక ప్లేయర్​ను ఉద్దేశించి అతడు బిగ్ మ్యాచుల్లో కీలకమంటూ కామెంట్స్ చేశాడు. అసలు హిట్​మ్యాన్ ఎవరి గురించి మాట్లాడాడంటే..

బంగ్లాదేశ్​తో మ్యాచ్​ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ఒక ప్లేయర్​ను ఉద్దేశించి అతడు బిగ్ మ్యాచుల్లో కీలకమంటూ కామెంట్స్ చేశాడు. అసలు హిట్​మ్యాన్ ఎవరి గురించి మాట్లాడాడంటే..

  • Author singhj Published - 08:10 PM, Fri - 20 October 23
రోహిత్ సెన్సేషనల్ కామెంట్స్.. బిగ్ మ్యాచ్​ల్లో అతడు కీలకమంటూ..!

వన్డే వరల్డ్ కప్​-2023లో భారత్ జోరు ముందు బంగ్లాదేశ్ నిలబడలేకపోయింది. గట్టి పోటీని ఇస్తుందనుకున్న బంగ్లా పప్పులు ఉడకలేదు. టీమిండియా ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన భారత్​కు ఓపెనర్లు రోహిత్ శర్మ (48), శుబ్​మన్ గిల్ (53) వండర్​ఫుల్ స్టార్ట్ అందించారు. వీళ్లిద్దరూ ఫస్ట్ వికెట్​కు 88 రన్స్ జోడించారు. రోహిత్ ఔటయ్యాక వచ్చిన శ్రేయస్ అయ్యర్​ (19) క్రీజులో కుదురుకున్నాక అనవసరం షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. గిల్ కూడా ఇదే విధంగా చెత్త షాట్ ఆడి పెవిలియన్​కు చేరాడు.

శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యాక కేఎల్ రాహుల్ క్రీజులోకి రావాలి. అయితే అప్పటికే మ్యాచ్​లో భారత్ కంఫర్టబుల్ ప్లేస్​లో ఉంది. గెలిచేందుకు మరో 78 రన్స్ చేస్తే సరిపోతుంది. క్రీజులో కుదురుకున్న కోహ్లీ మ్యాచ్ ఫినిష్ చేయాలనే తపనతో కనిపించాడు. దీంతో ఫామ్​లో ఉన్న రాహుల్​కు బదులు బ్యాటింగ్ ఛాన్స్ రాని రవీంద్ర జడేజాతో పాటు శార్దూల్ ఠాకూర్​లో ఎవరో ఒకరికి అవకాశం వస్తుందని అంతా భావించారు. హార్దిక్ పాండ్యా గాయం నేపథ్యంలో జడేజా, శార్దూల్ బ్యాటింగ్​లో కూడా టచ్​లో ఉన్నారో లేదో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ కనిపించింది. ముఖ్యంగా లార్డ్ శార్దూల్ బ్యాటింగ్ చేయాలని అంతా కోరుకున్నారు.

శార్దూల్ ఠాకూర్​తో గత మ్యాచుల్లో సరిగ్గా బౌలింగ్ వేయించకపోవడం, బ్యాటింగ్ ఛాన్స్ కూడా రాకపోవడంతో అతడిపై సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వచ్చాయి. శార్దూల్ టీమ్​లో ఉండి వేస్ట్.. అతడు ఆటలో అరటి పండు అంటూ ఏవేవో కామెంట్స్ వినిపించాయి. దీంతో టీమ్ మేనేజ్​మెంట్ కూడా అతడికి అవకాశం ఇవ్వాలని అనుకుందట. అయ్యర్ తర్వాత శార్దూల్​ను బ్యాటింగ్​కు పంపాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు రెడీ అవ్వాలని శార్దూల్​ను రోహిత్ సూచించాడట. కానీ అప్పటికే ప్యాడ్స్ కట్టుకొని, హెల్మెట్​, బ్యాట్​తో రెడీగా ఉన్న కేఎల్ రాహుల్​ గ్రౌండ్​లోకి దిగాడు.

రాహుల్ మైదానంలోకి దిగడంతో శార్దూల్​ ఠాకూర్​కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఈ విషయంపై మ్యాచ్ తర్వాత శుబ్​మన్ గిల్ క్వశ్చన్ అడగ్గా.. రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. శార్దూల్ గురించి రోహిత్ సంచలన కామెంట్స్ చేశాడు. అతడు బిగ్ మ్యాచుల్లో కీలకమన్నాడు. ‘శార్దూల్​ను బ్యాటింగ్​కు పంపుదామని అనుకున్నాం. కానీ అదే బాల్​కు అయ్యర్ ఔట్ అయ్యాడు. శార్దూల్ కిందకు వెళ్లేసరికి.. అప్పటికే రెడీగా ఉన్న రాహుల్ గ్రౌండ్​లోకి దిగాడు. శార్దూల్​కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ తప్పకుండా వస్తుంది. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్’ అని హిట్​మ్యాన్ చెప్పుకొచ్చాడు. మరి.. శార్దూల్​ను ఉద్దేశించి రోహిత్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంగ్లాతో మ్యాచ్​పై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తప్పు చేశానంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి