iDreamPost

న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఇది గమనించారా? కేన్ మామ స్పెషల్ ప్లాన్!

  • Author singhj Published - 05:56 PM, Sun - 22 October 23

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్​లో ఆడని కేన్ మామ ఒక స్పెషల్ ప్లాన్ వేశాడు.

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్​లో ఆడని కేన్ మామ ఒక స్పెషల్ ప్లాన్ వేశాడు.

  • Author singhj Published - 05:56 PM, Sun - 22 October 23
న్యూజిలాండ్​తో మ్యాచ్​లో ఇది గమనించారా? కేన్ మామ స్పెషల్ ప్లాన్!

వన్డే వరల్డ్ కప్​-2023లో భాగంగా భారత్-న్యూజిలాండ్​ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండు టీమ్స్ ఢీ అంటే ఢీ అంటూ ఆడుతూ మ్యాచ్​ను మరింత రసవత్తరంగా మార్చేశాయి. టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛేజింగ్​ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో తొలుత కివీస్ బ్యాటింగ్​కు దిగింది. అయితే ఆ టీమ్​కు మంచి స్టార్ట్ దొరకలేదు. డెవిన్ కాన్వే గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. అతడ్ని మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత తక్కువ గ్యాప్​లోనే మరో ఓపెనర్ విల్ యంగ్ (17) కూడా పెవిలియన్​కు చేరాడు. మెగా టోర్నీలో ఆడుతున్న తొలి మ్యాచ్​లో వేసిన ఫస్ట్ బాల్​కే విల్ యంగ్​ను ఔట్ చేశాడు మహ్మద్ షమి.

స్కోరు బోర్డు మీదకు 20 రన్స్ కూడా చేరకుండానే కివీస్ ఓపెనర్లు కాన్వే, యంగ్ పెవిలియన్ చేరారు. దీంతో ఆ టీమ్ ఒత్తిడిలో కనిపించింది. పిచ్ స్వింగ్​కు అనుకూలిస్తుండటంతో భారత పేసర్లను ఫేస్ చేయడం కష్టమైపోయింది. అయితే సూపర్ ఫామ్​లో ఉన్న రచిన్ రవీంద్ర (75), డారిల్ మిచెల్ (104 నాటౌట్) క్రీజులో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఒక్కో రన్ తీస్తూ రన్​రేట్ తగ్గకుండా చూసుకున్నారు. అయితే ఆ తర్వాత డ్రింక్స్ బ్రేక్​లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రేక్ టైమ్​లో న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డ్రింక్స్ తీసుకొని గ్రౌండ్​లోకి రావడం గమనించే ఉంటారు.

గ్రౌండ్​లోకి వచ్చిన విలియమ్సన్.. బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్​తో కాసేపు మాట్లాడాడు. భారత స్పిన్, పేస్ అటాక్​ను, పిచ్​ స్పందిస్తున్న తీరుపై వారితో చర్చించినట్లు అనిపించింది. కేన్ మామ స్పెషల్ ప్లానో లేదా ఏదైనా మంత్రం వేశాడో ఏమో గానీ కివీస్ బ్యాటర్లు గేర్లు మార్చారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​ను టార్గెట్ చేసుకొని ముందుకు దూసుకొచ్చి సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. జడేజా బౌలింగ్​లో వరుస బౌండరీలు కొట్టారు. కొద్దిసేపటికి రచిన్ ఔటైనా.. మిచెల్ మాత్రం జోరును కంటిన్యూ చేశాడు. ఈ వరల్డ్ కప్​లో మొదటి సెంచరీ సాధించాడు. గాయం కారణంగా మెగా టోర్నీలోని మ్యాచ్​లకు విలియమ్సన్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మ్యాచ్​లో ఆడకపోయినా సహచరులకు విలువైన సలహాలిస్తూ, గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇదీ చదవండి: World Cup: కసితో బౌలింగ్ చేస్తున్న షమి.. వేసిన ఫస్ట్ బాల్​కే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి