iDreamPost

ఇలాంటి మహిళలు కూడా ఉంటారా.? CCTVలో రికార్డు కాకుంటే ఎవ్వరు నమ్మలేరు

కస్టమర్లలా కలరింగ్ ఇచ్చి నగల దుకాణంలోకి వెళ్లి హంగామా చేశారు. త్వరగా పని ఉందంటూ చెప్పేసరికి మంచి బేరం తగిలిందని అనుకున్న యజమాని నగలు చూపించడం స్టార్ట్ చేశాడు. ఏమీ కొనకుండా వెళ్లిపోయారు. చివరకు

కస్టమర్లలా కలరింగ్ ఇచ్చి నగల దుకాణంలోకి వెళ్లి హంగామా చేశారు. త్వరగా పని ఉందంటూ చెప్పేసరికి మంచి బేరం తగిలిందని అనుకున్న యజమాని నగలు చూపించడం స్టార్ట్ చేశాడు. ఏమీ కొనకుండా వెళ్లిపోయారు. చివరకు

ఇలాంటి మహిళలు కూడా ఉంటారా.? CCTVలో రికార్డు కాకుంటే ఎవ్వరు నమ్మలేరు

వామ్మో వీరు మామూళ్లు లేడీస్ కాదు.. మహా ముదుర్లు. చేతి వాటం ప్రదర్శించడంతో వెల్ ట్రైయిన్డ్ దొంగలు. అత్యధిక పోలీసు కేసులున్న కేటుగాళ్లు కూడా వీరి ముందు దిగదుడుపే. చాక చక్యంగా కొట్టేయడంలో సిద్దహస్తులు. ఎలా ఉంటే.. బన్నీనుకు తెలియకుండా చెడ్డీలు కొట్టేసేం రకం. కళ్ల ముందే దొంగతనం జరుగుతుంటే.. గుర్తించలేకపోయారు యజమాని సైతం. చివరకు సీసీ కెమెరాల్లో రికార్డు అయితే తప్ప.. వారికి దొంగతనం జరిగిందన్న విషయం తెలియదట. కస్టమర్ల రూపంలో చక్కగా వచ్చి.. వస్తువులన్నీ చక్కచెట్టారట. సినీ ఫక్కీని తలపించే ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ భారీ దొంగతనం మిగిలిన నగల దుకాణ దారుల్ని ఎలర్ట్ అయ్యేలా చేసింది.

కౌడిపల్లి లేడీల కిలాడీ వ్యవహారం బయటకు వచ్చింది. కస్టమర్లుగా నగల దుకాణంలోకి వెళ్లి.. యజమానిని మాటల్లో పెట్టి చాక చక్యంగా 50 తులాల వెండిని నొక్కేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కౌడిపల్లిలోని ఓ నగల దుకాణానికి ముగ్గురు మహిళలతో పాటు ఓ వ్యక్తి వచ్చారు. తమకు ఫంక్షన్ ఉందని, అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లాలని చెప్పి.. నగలు చూపించాలని కాస్త హడావుడి చేశారు. మంచి బేరం వచ్చింది.. తక్కువ సమయంలో వెళ్లిపోతారు.. విసగించరని భావించిన యజమాని.. వారికి వెండి నగలు చూపించాడు. అతడ్ని మాటల్లో పెట్టి, ఓ మహిళా షాపు యజమాని కళ్లు గప్పి.. వెండి వస్తువులను దొంగిలించి, చటుక్కన అక్కడి నుండి జారుకుంది.

అలా ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా షాపు నుండి వెళ్లిపోయారు. అయితే తిరిగి నగలు సర్దుకుంటూ.. లెక్క వేయగా.. 50 తులాల వెండి వస్తువులు కనిపించలేదు. అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించగా.. మహిళలు ఆ నగలను దొంగిలించినట్లు తేలింది. వెంటనే ఆ షాపు యజమాని పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే ఆ చుట్టు పక్కల ఉన్న నగల దుకాణాదారులను కూడా జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేశారు. తన కళ్ల ముందే తనకే తెలియకుండా దొంగతనం చేయడం పట్ల ఆశ్చర్యానికి, బాధకు గురౌతున్నాడట యజమాని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి