iDreamPost

వీడియో: బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. ఎందుకంటే?

  • Published Feb 08, 2024 | 10:05 PMUpdated Feb 08, 2024 | 10:05 PM

బస్సుల్లో పది మంద చూస్తున్నారన్న ద్యాస లేకుండా జుట్లు పట్టుకొని, చెప్పులతో కొట్టుకుంటున్నారు మహిళలు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బస్సుల్లో పది మంద చూస్తున్నారన్న ద్యాస లేకుండా జుట్లు పట్టుకొని, చెప్పులతో కొట్టుకుంటున్నారు మహిళలు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  • Published Feb 08, 2024 | 10:05 PMUpdated Feb 08, 2024 | 10:05 PM
వీడియో: బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. ఎందుకంటే?

ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురవుతున్నారు.. ఆ క్షణంలో విచక్షణ మరిచి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. కొంతమంది మద్యం మత్తులో ఎదుటి వారిని దుర్భాషలాడటం, దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సాధారణంగా బస్సులు, రైల్ లో సీట్ల కోసం గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాం. చిన్న విషయమే అయినా ఆడవాళ్ల మధ్య ఇగో ప్రాబ్లామ్స్ వల్ల ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంది. బస్సులో ఇద్దరు మహిళల మధ్య గొడవ చెప్పులతో కొట్టుకునే స్థాయికి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల బస్సుల్లో మహిళలు బండ బూతులు తిట్టుకోవడం.. పొట్టు పొట్టు కొట్టుకోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాము బస్సులో ప్రయాణిస్తున్నామని.. చుట్టూ జనాలు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా తిట్టుకోవం, కొట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సర్ధి చెప్పడానికి వెళ్తే వారిపై మండిపడుతున్నారు. బస్సుల్లో మహిళల మధ్య జరిగే గొడవలను కొంతమంది ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నోట్టింట వైరల్ అవుతుంది. ఇద్దరు మహిళలు గొడవ పడుతుంటే.. మిగతా ప్రయాణికులు ప్రేక్షక పాత్ర వహంచి చూస్తున్నారు. బస్సులో విండో సీట్ కోసం గొడవ జరిగినట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది.

ముందుగా ఇద్దరు ఆడవాళ్ల మధ్య చిన్నగా మొదలైన గొడవ, చివరికి చెప్పులతో కొట్టుకునే స్థాయియి చేరుకుంది. మొత్తానికి కొద్దిసేపటి తర్వాత కండక్టర్ కలుగజేసుకొని ఇద్దరికీ సర్ది చెప్పి గొడవ సర్ధుమణిగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి అంతా తమ ప్రాపర్టలా ఫీల్ అవుతున్నారు.. అందుకే ఈ గొడవలు అంటూ ఒక నెటిజన్, పది మంది జనాలు ఉన్న బస్సుల్లో ప్రయాణం చేస్తున్నాం అన్న విషయం మరిచి పక్కవారికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు.. ఇది వారికే అవమానం అటూ మరో నెటిజన్ సోషల్ మాధ్యమాల్లో స్పందిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి