iDreamPost

నన్నే ఆపుతావా.. ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై రెచ్చిపోయిన మహిళ!

ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కారు నడిపి అడ్డుకున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై దాడికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా కారు నడిపి అడ్డుకున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై దాడికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?

నన్నే ఆపుతావా.. ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై రెచ్చిపోయిన మహిళ!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. రోడ్లపై ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నానా తిప్పలు పడుతుంటారు. రాంగ్ రూట్స్, ట్రిపుల్ రైడింగ్, అధిక స్పీడుతో వెళ్లకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పదేపదే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పట్టించుకోకుండా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి రోడ్లపై ట్రాఫిక్ జామ్ కు కారణమవుతుంటారు. అంతేగాక నిబంధనలు ఉల్లంఘించి డ్రైవ్ చేసే వారిని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులపై దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై ఓ మహిళ రెచ్చిపోయింది. అసలు ఏం జరిగిందంటే?

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ మహిళ హల్ చల్ చేసింది. రాంగ్ రూట్లో ప్రయాణించిన ఆమెను ట్రాఫిక్ హోమ్ గార్డ్ అడ్డుకున్నందుకు అతనిపై దాడికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్ లో ఓ మహిళ కారును రాంగ్ రూట్లో నడుపుకుంటూ వచ్చింది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ ఆ మహిళ కారును అడ్డుకున్నాడు. దీంతో ఆ మహిళ అతడిపై రెచ్చిపోయింది. రాంగ్ రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న హోంగార్డును బూతులు తిడుతూ.. నన్నే ఆపుతావా.. రాంగ్ రూట్ లో చాలా మంది వెళ్తుంటారు అంటూ హల్ చల్ చేసింది.

అక్కడున్న వారు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మహిళ మాత్రం వినలేదు. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న హోమ్ గార్డ్ పై దాడి చేసి బట్టలు చింపేసింది. ఆ తర్వాత ఫోన్ ను తీసుకుని నెలకేసి కొట్టి నానా రచ్చ చేసింది. దీంతో బాధితుడు ట్రాఫిక్ హోమ్ గార్డ్ బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మరి ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై మహిళ దాడికి పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి