iDreamPost

యువతి మరీ తెల్లగా ఉందని ఉద్యోగం ఇవ్వనన్నారు!

యువతి మరీ తెల్లగా ఉందని ఉద్యోగం ఇవ్వనన్నారు!

అందం ఆ యువతి పాలిట శాపంగా మారింది. ఇంటర్వ్యూలో అదరగొట్టాను.. జాబ్‌ గ్యారెంటీ అనుకుంటున్న ఆమెకు కంపెనీ హెచ్‌ఆర్‌నుంచి ఊహించని రిప్లై వచ్చింది. ఆ రిప్లై చదివి యువతి షాక్‌ అయింది. ఆమెకు ఉద్యోగం ఇవ్వటం కుదరదని ఆ కంపెనీ చెప్పింది. అందుకు కారణంగా ఆమె మరీ తెల్లగా ఉందని పేర్కొంది. తమ కంపెనీలో పని చేసేవాళ్లకు భిన్నంగా ఆమె రంగు ఉందని తెలిపింది. దీంతో యువతి గొల్లుమంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ప్రతీక్ష జిచ్‌కర్‌ అనే యువతి కొద్దిరోజుల క్రితం ఓ కంపెనీలో జాబ్‌ కోసం అప్లై చేసుకుంది. కంపెనీ హెచ్‌ఆర్‌ వాళ్లు ఆమెను ఇంటర్వ్యూకు పిలిచారు. ప్రతీక్ష మొత్తం మూడు రౌండ్ల ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. ఇంటర్వ్యూలతో పాటు ఓ అసైన్‌మెంట్‌ను కూడా ఆమె పూర్తి చేసింది. ఇంటర్వ్యూలు, అసైన్‌మెంట్‌లు విజయవంతంగా పూర్తి చేయటంతో జాబ్‌ పక్కాగా వస్తుందని ఆమె భావించింది. జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సదరు కంపెనీ హెచ్‌ఆర్‌నుంచి అనుకోని రిప్లై వచ్చింది.

కంపెనీ హెచ్‌ఆర్‌ ఇచ్చిన రిప్లైలో ఏముందంటే.. ‘‘ మీరు ఎంతో ఓపిగ్గా అన్ని రౌండ్ల ఇంటర్వ్యూల్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. దురదృష్టవశాత్తు మేము ఈ జాబ్‌లోకి మిమ్మల్ని తీసుకోలేము. మీరు ఈ జాబ్‌ చేయటానికి అన్ని రకాలుగా అర్హులే కానీ, మీరు మరీ తెల్లగా ఉన్నారు. ఇప్పుడున్న టీంలో మీరే ఎక్కువ తెల్లగా కనిపిస్తున్నారు. మేము మా టీంలో తేడాలను తీసుకురాదల్చుకోవటం లేదు. అందుకే మీకు జాబ్‌ ఇ‍వ్వటం లేదు. మీకు మంచి భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తున్నము’’ అని ఉంది.

ప్రతీక్ష ఈ రిప్లైని స్క్రీన్‌ షాట్‌ తీసింది. తర్వాత దాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మరీ తెల్లగా ఉందని ఉద్యోగం ఇవ్వనన్నారా? ఇదేం విడ్డూరం’’.. ‘‘ ఏంటిది? మరీ ఈ పాయింట్‌ మీద కూడా ఉద్యోగం ఇవ్వనని చెప్పేస్తారా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, యువతి మరీ తెల్లగా ఉందని ఉద్యోగం ఇవ్వనన్న ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 𝗨𝗣𝗗𝗔𝗧𝗘𝗦 𝗚𝗘𝗡𝗜𝗘 🧞‍♂️ | 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 (@updates_genie)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి