iDreamPost

జైలులో వీఐపీ కేటగిరీ ఉంటుందా..? ఏఏ సౌకర్యాలు ఉంటాయి

జైలులో వీఐపీ కేటగిరీ ఉంటుందా..? ఏఏ సౌకర్యాలు ఉంటాయి

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండును ఏసీబీ కోర్టు విధించడంతో ఆయనను పోలీసులకు జైలుకు తరలించారు. ఆయన కోసం స్నేహా బ్లాకులో ప్రత్యేకంగా గదిని కేటాయించారు. ఆ బ్లాక్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే చంద్రబాబుకు భోజనం, మెడిసన్ అందించేందుకు ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే ఆయన ఆరోగ్య రీత్యా హౌస్ రిమాండ్ కల్పించాలంటూ చంద్రబాబు తరుఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, ఆయనకు హౌస్ అరెస్ట్ అవసరం లేదని ప్రభుత్వ తరుఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. అదే సందర్భంలో గతంలో కూడా సెలబ్రిటీలు జైలుకు తరలించినప్పుడు ప్రత్యేకమైన గదుల్లో..ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. జైలుకు వెళ్లినా రాజ భోగాలు అనుభవిస్తుంటారు. రాచమర్యాదలు జరుగుతుంటాయి. అరెస్టైన జైలులో ఉండే వీఐపీలకు ప్రత్యేక కేటగిరి ఉంటుందా..ఉంటే ఎటువంటి సదుపాయాలు ఉంటాయంటే..?

దేశంలో 1894లో జైళ్ల చట్టం (ఫ్రిజన్స్ యాక్టు) అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఈ చట్టానికి కూడా పలుమార్లు సవరణలు జరిగాయి. అయితే ఈ నిబంధల్లో వీఐపీ ఖైదీలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండరు. అయితే ఖైదీకి ఉన్న ఆర్థిక స్థోమత, హోదా, జీవన శైలిని పరిగణనలోకి తీసుకుని స్పెషల్ క్లాస్ ప్రిజనర్ (ప్రత్యేక శ్రేణీ ఖైదీ)గా మాత్రమే పరిగణిస్తారు. దీని కోసం జైలులో ఉంటున్న వ్యక్తి కోర్టు నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికీ కల్పిస్తారా అంటే .. దీనికి కొన్ని పత్రాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ స్పెషల్ క్లాస్ ట్రీట్ చేయాలని కోర్టు పేర్కొన్నట్లయితే.. జైలులో ప్రత్యేక రూం, బెడ్, రీడింగ్ టేబుల్, కబోర్డు, ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇంటి నుండి భోజనం తెప్పించుకోవచ్చు లేదా సరుకులు తెప్పించుకుని జైలులో వండించుకుని తినొచ్చు. వండే వ్యక్తిని జైలు తరుఫున ఇస్తారు. జైలులో ప్రత్యేక బ్యారక్‌లు ఉంటాయి. వాటిల్లో ఉండే ప్రత్యేక గదులను వారికి కేటాయిస్తారు. అలాగే గదులకు ఎటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. బట్టలు ఉతకడానికి ప్రత్యేకమైన మనిషిని ఇస్తారు. ఇక భద్రత విషయానికి వస్తే.. పూర్తిగా అది జైళ్ల శాఖ కిందకు వస్తుంది. ఆయా సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందిని రానివ్వరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి