iDreamPost

టీటీడీపై బాబుకి బుద్ధి చెబుతున్న బ్యాచ్, తీరు మారేనా

టీటీడీపై బాబుకి బుద్ధి చెబుతున్న బ్యాచ్, తీరు మారేనా

తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ వివాదం రగల్చాలని టీడీపీ చేయని యత్నం లేదు. బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి నియామకం నుంచి అన్నింటినీ విమర్శించడం, ఆఖరికి అభాసుపాలుకావడం ఆపార్టీకి అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా మరోసారి టీటీడీపై టీడీపీ ఆరోపణలకు బాబు సన్నిహితులే సమాధానం చెబుతుండడం విశేషంగా కనిపిస్తోంది. తిరుమల క్షేత్రం చుట్టూ మత రాజకీయాలకు చంద్రబాబు యత్నిస్తుంటే సామాన్య భక్తుల సేవలు విస్తృతం చేసే ప్రయత్నంలో టీటీడీ ఉందని తేలిపోతోంది. అందుకు ఏపీ ప్రభుత్వం చేదోడుగా ఉందని స్పస్టమవుతోంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ టీటీడీ సేవలను కొనియాడారు. గతం కన్నా సుందరీకరణ పనులు అద్భుతంగా ఉన్నాయన్నారు. పరిశుభ్రత పాటిస్తున్నారని ప్రశంసించారు. రమణ ఒక్కరే కాదు ఇటీవల తిరుమల కొండకు వెళ్లిన సామాన్యులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు.చివరకు చంద్రబాబు చిరకాలమిత్రుడు సుజనా చౌదరి కూడా టీటీడీ సేవలను అభినందించారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తిరుమల దేవస్థానం మరింత పవిత్రంగా కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. అది కూడా ఏబీఎన్ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషంగా చూడాలి.

చంద్రబాబుకి ఇలాంటి నేతలంతా బుద్ధి చెబుతున్నప్పటికీ తిరుమల చుట్టూ వివాదాలు రాజేయాలనే బాబు బుద్ధి మారుతుందా అంటే సందేహమే. ఎందుకంటే తన హయాంలోనే ముద్రించిన బస్సు టికెట్ల చుట్టూ వివాదం రాజేయాలని చూసిన దశ నుంచి చివరకు కరెంటు పోల్ కూడా క్రాస్ అంటూ వక్రీకరించిన వైనం వరకూ అన్నింటికీ ఎన్టీఆర్ భవన్ నే ఆధారంగా ఉంది. టీడీపీ ఆఫీసు నుంచే అనేక అబద్ధాలు ప్రచారం చేస్తూ భక్తుల విశ్వాసాలతో ఆడుకున్న నేపథ్యం ఉంది. తిరుమల క్షేత్రం విశిష్టతను దెబ్బతీసేందుకు కూడా వెనుకాడని అనుభవం ఉంది. తమ రాజకీయాల కోసం వెంకటేశ్వరుని ఏడుకొండలను కూడా వాడుకున్న ఘనత బాబుదే అవుతుంది. అందుకే ఇప్పుడు వరుసగా పలువురు చంద్రబాబు నేస్తాలు చెబుతున్న విషయమయినా ఆయన చెవికెక్కుతుందా అంటే సందేహమే.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటుగా సీఎం జగన్ ని కూడా బద్నాం చేసేందుకు తిరుమల క్షేత్రాన్ని వాడుకున్న ఘనుడు చంద్రబాబు. అయినప్పటికీ అవాస్తవాలతో అందరినీ నమ్మించలేమని ఆయనకు అర్థమయ్యి ఉండాలి. కానీ అర్థసత్యాలతోనే అనుదినం గడిపేసే ఆయన తాజాగా అన్న ప్రసాదం విస్తరణ చుట్టూ కూడా విమర్శలు చేయించేందుకు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో జస్టిస్ రమణ, సుజనా వంటి వారి వ్యాఖ్యలు ఆసక్తికరంగా చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి