iDreamPost

Radhe Shyam : డార్లింగ్ టీమ్ మాట మీద ఉంటుందా

Radhe Shyam : డార్లింగ్ టీమ్ మాట మీద ఉంటుందా

ఇప్పుడు దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరి కన్ను రాధే శ్యామ్ మీదే ఉంది. ఆర్ఆర్ఆర్ అఫీషియల్ గా తప్పుకోవడంతో ఉన్న పాన్ ఇండియా మూవీ ఇదొక్కటే. జనవరి 14 విడుదల నుంచి తప్పుకునే ఛాన్సే లేదని నిర్మాతలు సంకేతాలు పంపుతున్నారు. మాట మీద నిలబడితే సంతోషమే. పండక్కు కరెక్ట్ సినిమా చూశామన్న ఆనందం ప్రేక్షకులకు ఉంటుంది. అందులోనూ ప్రభాస్ బొమ్మ కాబట్టి రికార్డుల ఊచకోత ఖాయం. చుట్టూ ఉన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ రాధే శ్యామ్ ఆ అడ్డంకాలను దాటుకుని ఖచ్చితంగా వెండితెరమీద ప్రేక్షకులను పలకరిస్తుందనే ధీమాలో అభిమానులు ఉన్నారు. వస్తే మంచిదే.

అయితే రాధే శ్యామ్ ఇలా తగ్గేదేలే అంటూ రిలీజ్ డేట్ కు కట్టుబడి ఉండటంలో ప్లస్సులు మైనస్సులు రెండూ ఉన్నాయి. ముందు సానుకూలతలు చూస్తే ఆర్ఆర్ఆర్ లేదు కాబట్టి నార్త్ బెల్ట్ లో ఓపెనింగ్స్ విషయంలో బాహబలి రికార్డులను టార్గెట్ చేయొచ్చు. బాలీవుడ్ నుంచి ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ సినిమా సంక్రాంతికి లేకపోవడంతో ఇండియా వైడ్ రాధే శ్యామ్ మాత్రమే ఆప్షన్ అవుతుంది. పుష్పనే అంత నెత్తినబెట్టుకున్న అక్కడి మాస్ ఆడియెన్స్ ఇక డార్లింగ్ మూవీని ఏ స్థాయికి తీసుకెళ్తారో వేరే చెప్పాలా. వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లు దీనికి కేటాయించడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. లాంగ్ రన్ కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

ఇక ప్రతికూలతల విషయానికి వస్తే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో 50 శాతం ఆక్యుపెన్సీ నడుస్తోంది. గుజరాత్ లో ఏకంగా థియేటర్లే మూసేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. రాత్రికి రాత్రే ఆదేశాలు రావొచ్చు. అదే జరిగితే వసూళ్ల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. జనంలో ఓమిక్రాన్ భయాలు స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీస్ తో కలిసి సినిమాకు వస్తారనే దాని మీద ఖచ్చితమైన అంచనాకు రాలేం. ఇవన్నీ బాక్సాఫీస్ మీద ప్రభావం చూపించే అంశాలే. సంక్రాంతి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరి రాధే శ్యామ్ కఠిన పరీక్షకు సిద్ధపడుతుందా లేదా వేచి చూడాలి

Also Read : Tollywood : నిర్మాతలు అలెర్ట్ గా లేకపోతే అంతే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి