iDreamPost

24 తర్వాత సినిమాలు క్యూ కడతాయా

24 తర్వాత సినిమాలు క్యూ కడతాయా

మొత్తానికి నిన్న లవ్ స్టోరీ కొత్త రిలీజ్ డేట్ ని 24గా ప్రకటించడంతో అక్కినేని అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి అసలు ఈ నెల విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మొత్తానికి నిర్మాతలు ఆ గాసిప్స్ కి చెక్ పెట్టేశారు. టాక్ తో సంబంధం లేకుండా సీటిమార్ కు ముఖ్యంగా బిసి సెంటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ స్ఫూర్తినిచ్చినట్టు కనిపిస్తోంది. లవ్ స్టోరీకి క్లాసు మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న ఈ సినిమా వాళ్ళను హాళ్లకు రప్పిస్తుందనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్లల బలంగా ఉంది.

ఇప్పుడు లవ్ స్టోరీకి ఇది మంచి అవకాశమే. ఆ రోజు చెప్పుకోదగ్గ వేరే చిత్రం ఏదీ పోటీలో లేదు. ఒకవేళ ఏవైనా బడ్జెట్ సినిమాలు రావొచ్చు కానీ వాటి ప్రభావం అంతగా ఉండే అవకాశం లేదు. సో కరెక్ట్ టాక్ తో పాజిటివ్ గా పబ్లిసిటీ జరిగితే చాలు థియేటర్ల దగ్గర వసూళ్ల లెక్కలు భారీగా ఉంటాయి. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగిన లవ్ స్టోరీ నిజానికి 10నే రావాల్సింది. కానీ టక్ జగదీష్ ఓటిటి రిలీజ్ కు కాంపిటీషన్ వెళ్లడం ఇష్టం లేక డ్రాప్ అయ్యింది. కానీ సీటిమార్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే దీని స్థానంలో చైతునే వచ్చి ఉంటే ఊహించని ఫిగర్లు నమోదయ్యేవని పంపిణీదారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదంతా ఒక కానీ సెప్టెంబర్ 24 తర్వాత ఇంకే సినిమాలు వస్తాయా అనే ఆసక్తి మూవీ లవర్స్ లో మొదలయ్యింది. అక్టోబర్ ని రిపబ్లిక్ తో ఓపెనింగ్ చేయబోతున్నారు. నిన్న సాయి తేజ్ కు జరిగిన ప్రమాదం తాలూకు ప్రభావం దాని మీద ఉండేలా లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కొండపొలం, మహాసముద్రం లాక్ అయ్యాయి కానీ అఖండ వస్తే ఊపొస్తుందని ఎగ్జిబిటర్లు ఆశపడుతున్నారు. బాక్సాఫీస్ కనీసం ఓ పాతిక కోట్ల కలెక్షన్ ని ఒక్క సినిమాతో చూడాలంటే అది పెద్ద హీరోతోనే సాధ్యం. అందుకే లవ్ స్టోరీకి వచ్చే లెక్కలను బట్టి డేట్లు చకచకా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి టికెట్ కౌంటర్లకు ఎలాంటి జోష్ వస్తుందో

Also Read : ఇప్పట్లో తేల్చడం రాజమౌళికి కష్టమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి