iDreamPost

“కోట్ల” రాజకీయ భవిషత్తు ఏమవుతుంది?

“కోట్ల” రాజకీయ భవిషత్తు ఏమవుతుంది?

ఆయనది దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకత్వం. అప్పుడు శాసించిన నాయకుడు… ఇప్పుడు జాడలేకుండా పోయారు. తాజాగా జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన శ్రమ ఏ మాత్రం ఫలించలేదు. పార్టీ పారినా ఆయన రాత మారలేదు. కేవలం ఇంటికే పరిమితం చేశారు ప్రజలు. ఆయనే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి. ఐతే కోట్లకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన మద్దతుదారుల ఓటమికి గల కారణాలేంటి?

కోట్ల కుటుంబ చరిత్ర సామాన్యమైంది కాదు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కుమారుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఏడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కర్నూలు ఎంపీగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఐదు సార్లు పోటీ చేసి గెలిచారు. ఇక ఆయన తనయుడు కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి.. నాలుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కర్నూలు జిల్లా వీరి కంచుకోట. ఒక్కప్పుడు రాష్ట్రాన్నే శాసించిన కోట్ల ఫ్యామిలీ.. రాష్ట్ర విభజన తర్వాతన కాంగ్రెస్‌తో పాటే కనుమరుగైంది.

Also Read : తిరుపతిలో కమలం చుట్టూ మూడు ముళ్ళు

దశబ్దాల నుంచి రాజకీయాలను శాసించిన కోట్ల కుటుంబం… 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది. దీంతో రాజకీయాలలో కోట్ల ఫ్యామిలీకి ఏమాత్రం ప్రాతినిథ్యం లేకుండా పోయింది. దీంతో తీవ్ర రాజకీయ సంక్షోభంలో ఉన్న కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఫ్యామిలీ… 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి జంప్‌ చేసింది. ఐతే పెద్ద ఫ్యామిలీ కావడంతో చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. దీంతో కోట్ల బ్రదర్స్‌ రాజకీయంగా చీలిపోయారు.

అప్పటి దాక కాంగ్రెస్‌లో ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు హర్షవర్ధన్‌ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సూర్యప్రకాష్‌ రెడ్డి టీడీపీలో చేరగా… ఆయన సోదరుడు వైసీపీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో సూర్యప్రకాష్‌ రెడ్డి కర్నూలు పార్లమెంట్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా… ఆయన భార్య ఆలూరు అసెంబ్లీ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పార్టీ మారినా వీరి రాత మాత్రం మారలేదు. 2014 నుంచి కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. దీంతో కోట్ల ఫ్యామిలీ రాజయకీయాలలో గల్లంతు అయ్యింది.

వైఎస్‌ఆర్‌సీపీ అధికారం చేపట్టిన తర్వాత జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరు ప్రభావం పెద్దగా కనిపించలేదు. కేవలం పదకొండు పంచాయతీలకే పరిమితమయ్యారు. కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు టౌన్‌, పూలకూర్తి, అమడగుంట్లతో పాటు ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు, అరికెర, పెద్దహోతూరు, మొలగవల్లి, మొలగవల్లి కొట్టాల, మనెకూర్తి పంచాయతీలలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మద్దతుదారులు గెలుపొందారు. ఐతే ఆయన స్వగ్రామమైన లద్దగిరిలో ఓటమి పాలయ్యారు. అక్కడ ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందడంతో కోట్ల ఫ్యామిలీకి తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పొచ్చు.

Also Read : ఓర్వకల్లు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుని పేరు పెట్టిన సీఎం జగన్

కోట్లకు మంచు పట్టున్న కర్నూలు జిల్లాలో.. వీరి రాజకీయ మంత్రాంగం ఏ మాత్రం ఫలించలేదు. కేవలం పార్టీలలో రెండు వర్గాల అధిపత్య పోరువల్లనే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించలేకపోయారే ప్రచారం నడుస్తోంది. ఏది ఏమైన ఫ్యాన్‌ హవా ముందు అన్ని కొట్టుకపోయాయనే చెప్పవచ్చనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి