iDreamPost

అచ్చెన్న మీద చర్యలు తీసుకుంటారా ?

అచ్చెన్న మీద చర్యలు తీసుకుంటారా ?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయా అంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఈ నెల 17 నా జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసిపి భారీ విజయం సాధిస్తుందని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే జరిగిన మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి గోరపరభవం చవిచూసింది. ఇక పరిషత్ ఎన్నికల్లో అయితే ఏకంగా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలలో అయినా పార్టీ పరువు దక్కించుకుందామని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఉప ఎన్నికల్లో పాత ఫలితాలు పునరావృతం అయితే అచ్చెన్నాయుడు పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తెలుగు చూసిన వీడియో లో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

టీడీపీకి ఏదీ కలిసి రావడం లేదు. షాక్ లపై షాక్ లు తగులుతూనే ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి ఆ పార్టీ విజయం రుచి చూడడం మరిచిపోయింది. వరుస ఓటములు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగాయి. సీనియర్ నేతలు ప్రస్తుతం చంద్రబాబు మాటను పట్టించుకునే పరిస్థితి లేదు. అధిష్టానం ఒకంటంటే పార్టీ నేతలు మరో మాట అంటున్నారు. ప్రతి జిల్లాల్లో ధిక్కార స్వరాలు పెరిగాయి. అసలు పార్టీలో ఉన్నది ఎవరు లేనిది ఎవరు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. నాలుగు వైపులా నష్టాలు తరుముకొస్తున్న వేల తిరుపతి ఉప ఎన్నికలో నెగ్గి.. పార్టీని నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు ఆరాటపడుతున్నారు. విరామం లేకుండా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం చేస్తున్నారు. పనబాక లక్ష్మి గెలుపు బాధ్యతను తనపై వేసుకున్నారు.

అయితే తిరుపతి ఉప ఎన్నిక ముందు కూడా పార్టీకి షాక్ లు తగ్గడం లేదు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వీడియో పార్టీలో సునామీలా మారింది. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మరో టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ వీడియో ఏపీ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. పార్టీ కేడర్ ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని.. ఓ టీడీపీ నేత అచ్చెన్నాయుడి ముందు గోడు వెల్లబోసుకున్నాడు. తండ్రీ కొడుకులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. తనకు పార్టీలో అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రదర్ అంటూ ఒకప్పుడు మాట్లాడే లోకేష్.. ఇప్పుడు కూర్చో అమ్మా అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని. పార్టీ కోసం 30 ఏళ్లు కష్టపడ్డ తనకు అన్యాయం చేశారంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు. మొదట సర్ధి చెప్పేందుకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడు మధ్యలో కలుగచేసుకుని. లోకేష్‌ను‌ ఉద్దేశించి ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. తరువాత పార్టీ లేదు.. ఏమి లేదంటూ ఆ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Also Read : ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ..!

అయితే ఆ వీడియోపై అచ్చెన్నాయుడు స్పందించారు. లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐకమత్యంతో పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే అచ్చెన్నాయుడు తో ఉన్న మరో నేత టిడిపి కి గట్టి షాక్ ఇచ్చారు తనకు చంద్రబాబు నుంచి లోకేష్ నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో అచ్చెన్నాయుడు మాటల్లో నిజమెంత అనేది ప్రజలకు అర్థం అయింది.

మరోవైపు ఈ వీడియో సంభాషణలపై ఇటు చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా అసహనంతో ఉన్నారు. లోకేష్ తనతో సన్నిహితంగా ఉండే లీడర్ల దగ్గర ఆ వీడియో ప్రస్తావన తెచ్చినట్టు సమాచారం. తిరుపతి ఉప ఎన్నిక తరువాత ఆ వీడియో సంగతి తేలుద్దామని అన్నట్టు తెలుస్తోంది. అసలు అచ్చెన్నతో ఆయన మాట్లాడేందుకు ప్రస్తుతం ఇష్టపడడం లేదని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాల సంగతి ఎలా ఉన్నా.. అచ్చెన్నాయుడు వీడియోపై వైసీపీ నేతల ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా అచ్చన్నాయుడు లోకేష్ ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎప్పటికీ ఎడమొహం పెడమొహం అన్నట్లు వీరిద్దరి వ్యవహార శైలి ఉంది ఇది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ నెల 17న తిరుపతి ఉప ఎన్నిక ముగిసిన తర్వాత అచ్చం నాయుడు పార్టీని వీడుతారా అనే సందేహం కూడా లేకపోలేదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు పార్టీని వీడితే జరిగే నష్టంపై టిడిపిలో అంతర్గతంగా చర్చ సాగుతోంది.

తాజాగా విజయసాయి టీడీపీపై సెటైర్లు వేశారు ట్విట్టర్ లో. ఈ నెల 17 తరువాత.. అంటే తిరుపతి ఉపఎన్నిక తర్వాత తెలుగు దేశం పార్టీ లేదు, అదీ లేదని అచ్చెన్నాయుడు అన్నారని.. ఆయనే సరైనోడైతే అంటూ లోకేశ్ విషయం కూడా బయటపెట్టారని.. నిజంగా ఈ విషయంలో అచ్చెన్నాయుడ్ని శభాష్ అంటూ మెచ్చుకోవాలి అన్నారు. మరి నిజాలు చెప్పినందుకు ఆయన్న పక్కన పెడతారా? లేక అచ్చన్న కూడా తిరుపతి ఉప ఎన్నిక తరువాత టీడీపీని వదిలేస్తారా అంటూ ప్రశ్నించారు.

Also Read : టీడీపీ, లోకేష్‌లపై అచ్చెం నాయుడు సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి