iDreamPost

అంబటి రాయుడు పొలిటికల్‌ ఎంట్రీకి సర్వ సిద్ధం.. అక్కడి నుంచే పోటీ?

  • Author Dharani Updated - 05:09 PM, Sat - 17 June 23
  • Author Dharani Updated - 05:09 PM, Sat - 17 June 23
అంబటి రాయుడు పొలిటికల్‌ ఎంట్రీకి సర్వ సిద్ధం.. అక్కడి నుంచే పోటీ?

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంబటి రాయుడు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా.. గత కొన్ని రోజులుగా అంబటి రాయుడు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డితో వరుసగా భేటీ అవ్వడమేకాక.. వైసీపీ ప్రభుత్వ పరిపాలనను ప్రశంసిస్తూ.. ట్వీట్లు, కామెంట్లు చేస్తుండటంతో.. రాయుడు పొలిటికల్‌ ఎంట్రీ పక్కా అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటి వరకు తన పొలిటికల్‌ ఎంట్రీపై రాయుడు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగానే.. రాయుడు.. పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి జోరుగా ప్రచారం సాగుతుంది. ఆ వివరాలు..

అంబటి రాయుడు త్వరలోనే వైసీపీలో చేరతారని.. అంతేకాక లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. రాయుడు గత వారం గుంటూరు నుంచి వచ్చి రెండు సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. దాంతో ఆయన పొలిటికల్‌ ఎంట్రీపై జోరుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాక సీఎం జగన్‌.. వచ్చే ఎన్నికల్లో రాయుడిని పోటీకి దింపాలని జగన్ భావిస్తున్నారని.. అయితే అది అసెంబ్లీనా లేకలోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. రాజకీయాల్లోకి వస్తున్న యువతకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద స్ఫూర్తి అని.. ఒక ప్రాంతంపై దృష్టి పెట్టకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధిలో దూసుకుపోతున్నారంటూ గతంలో అంబటి రాయుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఇకపై తాను జగన్ నిర్ణయం మేరకే నడుచుకుంటానని వెల్లడించాడు.

రాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పొన్నూరు, గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని వైసీపీలోని సీనియర్ రాజకీయ నాయకులు సూచించినట్లు తెలుస్తోంది. మరి కొందరు సీనియర్‌ నేతలేమో.. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం రాయుడికి బెస్ట్‌ ఆప్షన్‌ అనిభావిస్తున్నారట. వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ వి.బాలసౌరి, పొన్నూరు నుంచి ఎమ్మెల్యే కేవీ రోశయ్య ఉన్నారు. మరి రాయుడు రాజకీయాల్లోకి వస్తాడో రాడో అనేది త్వరలోనే తెలియనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి