iDreamPost

కళ్లుచెదిరే ధరతో ఆల్ న్యూ స్విఫ్ట్.. ఫీచర్స్ కూడా అదిరిపోయాయి!

All New Swift 2024 Price: మారుతీ కార్లు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్విఫ్ట్ 2024తో మరోసారి ఆ విషయం రుజువైంది. పైగా ఈసారి చాలా ప్రీమియం ఫీచర్స్ తో ఈ కారు రావడం విశేషం.

All New Swift 2024 Price: మారుతీ కార్లు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్విఫ్ట్ 2024తో మరోసారి ఆ విషయం రుజువైంది. పైగా ఈసారి చాలా ప్రీమియం ఫీచర్స్ తో ఈ కారు రావడం విశేషం.

కళ్లుచెదిరే ధరతో ఆల్ న్యూ స్విఫ్ట్.. ఫీచర్స్ కూడా అదిరిపోయాయి!

కారు అంటే అప్పట్లో విలాసంగా భావించేవాళ్లు. కానీ, రోజులు మారిపోయాయి. ఇప్పుడు కారు అందరికీ అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారికి కారు తప్పక ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లాలి అంటే క్యాబులకు ధరలు మోగిపోతున్నాయి. అయితే మధ్యతరగతి వారికి మంచి బడ్జెట్ లో కారు కావాలి అంటే కాస్త కష్టంగా మారిపోయింది. కానీ, ఎప్పటికీ మారుతీ సుజుకీ కంపెనీ నుంచి మాత్రం మిడిల్ క్లాస్ కోసం ఒక బడ్జెట్ కారు రెడీగా ఉంటుంది. దానిలో ఒకటైన మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు సరికొత్తగా వచ్చేసింది. ధర, స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం.

మీరు రోడ్డు మీదకు వెళ్తే.. పదిలో కనీసం 4 స్విఫ్ట్ కార్లు కనిపిస్తాయి. వాటికి మార్కెట్ లో అంత డిమాండ్ ఉంది. ఇన్నాళ్లు బడ్జెట్ లోనే లిమిటెడ్ ఫీచర్స్, లుక్స్ తో ఉండేది. కానీ, ఇప్పుడు ఇందులో ఫోర్త్ జెనరేషన్ వచ్చేస్తోంది. మొత్తానికి లుక్స్ ని మార్చేశారు. అలాగే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కూడా మారిపోయాయి. చూడటానికి ఎంతో ప్రీమియం లుక్స్ లో కనిపిస్తోంది. అయితే కాస్త ధర కూడా పెరిగింది. ఈ ఆల్ న్యూ స్విఫ్ట్ కారు ధర రూ.6.50 లక్షల నుంచి రూ.9.5 లక్షల రేంజ్ లో ఉంటోంది. మీరు మోడల్ మార్చే కొద్దీ ధర, ఫీచర్స్ పెరుగుతూ ఉంటాయి. హైఎండ్ ధర రూ.9.5 లక్షల వరకు ఉంటుంది.

ఈ మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ చూస్తే.. ఇప్పుడు సరికొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజియన్ ను తీసుకొచ్చారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. 80 బీహెచ్పీ- 112 ఎన్ఎం టార్క్ తో వస్తోంది. ఈ స్విఫ్ట్ ఇంటీరియర్ లో చాలా మార్పులు చేశారు. చూడటానికి బలేనో, ఫ్రాంక్స్, బ్రెజా కార్లను పోలి ఉంటుంది. బేసిక్ మోడల్ లో 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టాప్ ఎండ్ లో 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. వైర్ లెస్ ఛార్జింగ్, హెడ్ అప్ డిస్ ప్లే ఉన్నాయి.

ఆ మారుతీ స్విఫ్ట్ కారులో ఈసారి భద్రతను కూడా బాగా పెంచేశారు. ఈ కారుకు గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ లో 4 స్టార్ దక్కడం విశేషం. బేసిక్ లెవల్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తోంది. అలాగే 360 డిగ్రీ కెమెరా, బ్యాక్ సీట్ కి కూడా ఏసీ వెంట్స్ వంటి ఫీచర్స్ ఉంటున్నాయి. ఇంక ఎక్స్ టీరియర్ చూస్తే.. ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్లను మార్చేశారు. స్పెషల్ డీఆర్ఎల్స్ తో లైట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్విఫ్ట్ కారుపై మార్కెట్ లో మంచి క్రేజ్ పెరిగిపోయింది. మరి.. ఆల్ న్యూ స్విఫ్ట్ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి