iDreamPost

వైకుంఠ ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారో తెలుసా?

ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలు కిట కిటలాడుతుంటాయి. ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అంటారు.

ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలు కిట కిటలాడుతుంటాయి. ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అంటారు.

వైకుంఠ ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారో తెలుసా?

భారత దేశంలో హిందువులు భగవంతుడిని ఎంతగా పూజిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.. నిత్యం వేల సంఖ్యల్లో భక్తులు ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. ప్రతినెల ఏకాదశి ఉంటుంది.. కానీ ప్రతి సంవత్సరం ఒక్కసారి వచ్చే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రత్యేకం ఉంటుంది. హిందువుల సంప్రదాయంలో వైకుంఠ ఏరాదశికి ముఖ్యస్థానం ఉంది. ఇది ధనుర్మాసంలో వస్తుంది. వైకుంట ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా ఉంటారు. ఈ రోజున భక్తులు స్వామి వారిని రక రకాలుగా పూజిస్తుంటారు. ఈ రోజుకే ఎందుకు అంత ప్రత్యేకం అని అనుకుంటున్నారా? ఈ ఏకాదశికే అన్ని పేర్లు ఎలా వచ్చాయి? ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎంతోమంచిది అని ఎందుకు అంటారు? డిసెంబర్ 23 న వైకుంఠ ఏకాదశి. ఈ రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. వివరాల్లోకి వెళితే..

భారతీయుల సంప్రదాయాల్లో వైకుంఠ ఏకాదశకిమి ఎంతో ముఖ్యస్థానం ఉంది. ఈ రోజు వైష్ణవాలయాల్లో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడుతుంటారు. సూర్యడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి.. మార్గశిర శుక్లపక్షంలో వచ్చే శుద్ద ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఇది ధనుర్మాసంలో వస్తుంది. ఈ ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో కలిసి వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి స్వామివారిని దర్శించుకొని తమ బాధనలు విన్నవించుకుంటారు. ఆయన అనుగ్రహంతో రాక్షస పీడ నుంచి విముక్తులు అయ్యారు. ఏకాదశి రోజున దేవతలు ఉత్తర ద్వారం గుండా వెళ్లడం ద్వారా శ్రీ విష్ణుమూర్తి దర్శనం జరిగిందని అందువల్లే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. మూడుకోట్ల దేవతలకు గరుడ వాహనుడైన శ్రీమన్నారాయణుని దర్శనానుగ్రహం ప్రసాదించడం వల్ల ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు.

vykunta ekadasi

డిసెంబర్ 23, 2023 న వైకుంఠ ఏకాదశి లేదా ము  క్కోటి ఏకాదశి. ఈ రోజు తెల్లవారుజామునే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం భక్తులు ఆలయాలకు వస్తారు. శ్రీ మహావిష్ణు యోగ నిద్రలో లేచిన తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న రోజునే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈ సమయంలో ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శిస్తారు, పూజిస్తారు.. అందుకే ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు భక్తులు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ సకల పాపాలు హరిస్తాయి, కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది. కష్టాలు దూరమైతాయి అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రముఖ దేవాలయాలు తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ పుణ్య క్షేత్రాల్లో మామూలు రోజుల్లో ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. కానీ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షణలు ముగించుకుని స్వామివారి దర్శనం చేసుకుంటారు. హైందవ సంప్రదాయం భక్తులు గాయత్రి మంత్రాన్ని జపించినా.. ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకున్నా ఎంతో పుణ్యం అంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి