iDreamPost

పెద్దవాళ్ళు టీనేజ్ గర్ల్స్‌లా స్టైల్‌గా ఉండాలనుకుంటారు! ఎందుకో తెలుసా?

Why Old Woman Behave Like Teenagers: పెద్దవాళ్ళని గమనిస్తే వాళ్ళు టీనేజ్ అమ్మాయిల్లా మేకప్ వేసుకోవడం.. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ వయసులో అవసరమా అంటే మాట వినరు. మరి వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసా?

Why Old Woman Behave Like Teenagers: పెద్దవాళ్ళని గమనిస్తే వాళ్ళు టీనేజ్ అమ్మాయిల్లా మేకప్ వేసుకోవడం.. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ వయసులో అవసరమా అంటే మాట వినరు. మరి వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసా?

పెద్దవాళ్ళు టీనేజ్ గర్ల్స్‌లా స్టైల్‌గా ఉండాలనుకుంటారు! ఎందుకో తెలుసా?

మీరు గమనిస్తే చాలా మంది వయసులో పెద్దగా ఉన్న వాళ్ళు అంటే 40, 50 ఏళ్లు దాటిన పెద్ద వాళ్ళు టీనేజ్ అమ్మాయిల్లా ప్రవర్తిస్తుంటారు. ఒంటి నిండా బంగారం, ఖరీదైన చీరలు ధరించి స్టైల్ గా ఉండాలని అనుకుంటారు. ఇంట్లో ఉన్న మనవళ్లు, మనవరాళ్లతో నాన్నమ్మ, అమ్మమ్మ అని పిలిపించుకునే వయసున్న వారు స్టైల్ గా ఉండాలని తాపత్రయపడుతుంటారు. నలుగురిలో స్టైల్ గా, అందంగా కనబడాలని అనుకుంటారు. మహిళలే కాదు.. తాత వయసున్న మగాళ్లు కూడా ఇలానే ఉండాలని అనుకుంటారు. పెద్దవాళ్ళు తమను తాము హీరోలుగా, హీరోయిన్లుగా ఫీలవుతూ మురిసిపోతుంటారు. అయితే వీరిని చూసి చాలా మంది నవ్వుతారు. ఈ వయసులో ఇవన్నీ అవసరమా అని తీసి పడేస్తుంటారు. ఈ వయసులో అంతంత బంగారం, ఖరీదైన చీరలు అవసరమా? పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి.. ఈ వయసులో దీనికి సోకులు తక్కువచ్చాయా?’ అని దెప్పి పొడుస్తుంటారు.

ఇవి పల్లెటూర్లలో బాగా ఎక్కువగా వినిపించే మాటలు. ఈ మాటలు విన్నాక.. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు అన్న మాటలు నిజమే కదా అని పెద్దవాళ్ళని గబుక్కున ఒక మాట అనేస్తారు. కానీ దాని వెనకున్న ఎమోషన్ ని ఎవరూ గుర్తించరు. కనీసం గుర్తించే ప్రయత్నం కూడా చేయరు. అమ్మా, ఈ వయసులో నీకెందుకే ఇవన్నీ అని పుసుక్కున ఒక మాట వదిలేస్తారు. ముసలోడికి దసరా పండుగ అని నాన్నని తేలిగ్గా తీసిపడేస్తారు. కానీ దీని వెనుక ఉన్న సైకలాజికల్ థింగ్ ని ఎవరూ అర్థం చేసుకోరు. ఇది మనసుకు సంబంధించిన విషయం. అందుకే వాళ్ళు ఆ వయసులో అలా ప్రవర్తిస్తారు. అలా అని ఇది మానసిక వ్యాధి కాదు. 

Why aged womens want to be like teenagers

ఒకప్పుడు వాళ్ళు ఏదైతే కోల్పోయారో వాటన్నిటినీ సంపూర్ణంగా ఆస్వాదించాలన్న బలమైన కోరిక నుంచి పుట్టిన ఒక మానసిక సంతోషం. పెళ్ళైనప్పటి నుంచి బాధ్యతల పేరుతో ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. పేదరికం నుంచో.. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచో వచ్చి అత్తారింట్లో అడుగుపెట్టి ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు. తినడానికి తిండి కూడా లేని స్థితిలో జీవించి ఉంటారు. పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం, వారి ఆనందం కోసం చిన్న చిన్న ఆనందాలను పక్కన పెట్టేస్తారు. అదృష్టం కొద్దీ పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మెరుగుపడచ్చు. ఆ టైంలో గతంలో కోల్పోయిన ఆనందాలను తిరిగి పొందాలని అనుకుంటారు. కొంతమంది పిల్లలకు జాబ్ వచ్చి.. ఆ తర్వాత పెళ్లిళ్లు చేసే వరకూ కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుంది.

కుటుంబ బాధ్యతల్లో పడి బంగారం, ఖరీదైన బట్టలు వంటి వాటి మీద వ్యామోహం పెంచుకోరు. ఎప్పుడైతే పిల్లలకు ఉద్యోగాలు వచ్చి.. పెళ్లిళ్లు చేసి.. తమ బాధ్యత తీరిందని ఊపిరి పీల్చుకుంటారో.. అప్పటి నుంచి తమ గతంలో కోల్పోయిన చిన్న చిన్న ఆనందాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆడవారే కాదు.. మగాళ్లు కూడా ఈ విషయంలో రాజీపడరు. దీనికి కారణం బాధ్యతలతో కూడిన ఒత్తిడి లేకపోవడమే. దీని వల్ల వారి మనసు చాలా తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. అప్పటి వరకూ పెంపకంలో పడి తమ గురించి ఆలోచించుకోని వారికి.. తొలిసారిగా వారి గురించి ఆలోచించుకునే అవకాశం వస్తుంది. ఈ కారణంగానే వారు వయసులో ఉన్నప్పుడు కోల్పోయిన చిన్న చిన్న ఆనందాలను తిరిగి పొందాలని అనుకుంటారు. 

Why aged womens want to be like teenagers

పెద్దవాళ్ళు ఇలా ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. మనిషి జన్మ.. పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకూ ఇదంతా ఒక చక్రం అన్న సంగతి తెలిసిందే. ఆ చక్రం ప్రకారం మనిషి పుట్టినప్పుడు ఎలా ఉన్నారో.. చనిపోయే దశ ముందు కూడా అలానే ఉంటారు. కడుపులో ఉన్నప్పుడు బిడ్డ దగ్గరకు ముడుచుకుని ఎలా ఉంటాదో.. అలానే వృద్ధాప్యం వచ్చాక మనుషులు కూడా నడుము వంగిపోయి బిడ్డలా అయిపోతారు. ప్రవర్తన కూడా చిన్న పిల్లల్లానే ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు చేస్తే మారాం.. వృద్ధాప్యంలో చేస్తే అది చాదస్తం అవుతుంది. అయితే ఇదంతా హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల జరిగే ప్రక్రియ అని పరిశోధకులు చెబుతున్నారు. ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలతోనే సమానం అని అంటారు. ఇవేమీ తెలియని వాళ్ళు పెద్దవాళ్ళను అర్థం చేసుకోకుండా విమర్శిస్తుంటారు.

నిజానికి వారిని విమర్శించే వాళ్లదే మానసిక వ్యాధి అనేది నిపుణుల మాట. అయినా తమకు నచ్చినట్టు ఉండడం ఏమన్నా నేరమా? ఒకప్పుడు కోల్పోయిన సంతోషాలను ఒక వయసు వచ్చాక అనుభవించడం ఏమన్నా పాపమా? వీరు స్టైల్ గా ఉండడం వల్ల ఎవరికీ అన్యాయం అయితే జరగడం లేదు కదా. ఇంకా వీరి వల్ల చీరల వ్యాపారులు, నగల వ్యాపారులు బాగుపడుతున్నారు. పెద్దల వల్ల మంచి బిజినెస్ జరుగుతుందంటే ఆనందించాల్సింది పోయి వారిని విమర్శించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.  చిన్నప్పటి నుంచి బాధలు అనుభవించిన వారిని కనీసం చివరి దశలో అయినా సంతోషంగా ఉండనివ్వడం పిల్లల బాధ్యత. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి