iDreamPost

నిమ్మగడ్డ లేఖ వెనుక ఆంధ్రజ్యోతి ఆత్రం ఎందుకు..?

నిమ్మగడ్డ లేఖ వెనుక ఆంధ్రజ్యోతి ఆత్రం ఎందుకు..?

“ఎనకటికి ఒకడు ఎద్దు ఈనింది అంటే దూడను గాటికి కట్టండి అన్నాడట” అట్ట అడగటం ఇట్టా సమాధానం చెప్పడం దాన్ని పేపర్లో ప్రచురించడం అన్ని గంటల వ్యవధిలో జరిగిపోతున్నాయి. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేస్తూ తనకు రక్షణ లేదని కేంద్రమే రక్షణ కల్పించాలి అని మొన్న 18వ తేదీ రాత్రి మీడియాలో లీక్ అయ్యి 40 గంటలు గడుస్తున్నా ఆయన అధికారికంగా స్పందించడు. కానీ తెలుగు మీడియా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి గంటల తరబడి చర్చలు జరుపుతూ, తరువాత పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తున్నాయి.

రమేష్ కుమార్ లేఖ రాయలేదని రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా దృవీకరించుకున్న తర్వాత ఆ లేఖ ఎవరు రాశారో విచారణ జరిపి కుట్రదారులను బయటపెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంతరెడ్డి,అంబటి రాంబాబు తదితరులు డిమాండ్ చేశారు. మరోవైపు ఆ ఉత్తరం ఆకాశరమన్న రాశారో, ఆకాశ చంద్రన్న రాసారో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ అధికార, ప్రతినిధి రాజ్యసభ సభ్యులు GVL డిమాండ్ చేశారు. టీడీపీ మాత్రం అది రమేష్ కుమార్ రాశారని వాదిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైనప్పటి నుంచి టీడీపీ చేస్తోన్న ఆరోపణలు, డిమాండ్లు ఆ ఉత్తరంలో ఉండటం అనే అనుమానాలు తావిస్తోంది.

ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా నీరజ్ కుమార్ అనే ఒక వ్యక్తి రమేష్ కుమార్ ఉత్తరం రాశారా..? లేదా..? అని చెప్పాలని RTI క్రింద కేంద్ర హోంశాఖను కోరగా కేంద్రం ఆ లేఖ రమేష్ కుమారే రాసారని దృవీకరించిందని సదరు నీరజ్ కుమార్ ట్విట్టర్ లో పెట్టినట్టు ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని వండివర్చింది.

RTI వ్యవహార తీరు తెలిసిన ఎవరికైనా 24 గంటల్లోన్నే RTI అధికారులు స్పందించి నీరజ్ కుమార్ అడిగిన సమాచారాన్ని అందించడం ఆశ్చర్యం కలిగించక మానదు. రమేష్ కుమార్ అనే ఒక అధికారి రాష్ట్ర ప్రభుత్వం మీద పిర్యాదు చేస్తూ రాసాడని చెప్పబడుతున్న ఉత్తరానికి సంబంధించిన సమాచారాన్నికేంద్ర హోంశాఖ ఒక ప్రైవేట్ వ్యక్తి ఎందుకు చెప్తుందో ఆంధ్రజ్యోతి పత్రిక కే అర్థం కావాలి.

ప్రభుత్వాలకు సంబంధించిన ఇలాంటి సమాచారాన్ని ముక్కుమొహం తెలియని నీరజ్ కుమార్ అనే అనమకుడుకి కేంద్ర హోంశాఖ చెప్పింది అంటే ఒక్క ఆంధ్రజ్యోతి తప్ప సామాన్యులు ఎవరూ నమ్మరు.

అసలు ట్విట్టర్లో నీరజ్ కుమార్ లు ఎంత మంది ఉన్నారు అని చూడగా వెరిఫీడ్ అకౌంట్స్ కేవలం ఐదారు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి బిహార్ కు చెందిన బీజేపీ mlc కాగా బయటి రాష్ట్రాలకు చెందిన ఇద్దరు IPS లు మరియు హైదరాబాద్ కు చెందిన ఒక జర్నలిస్టు అకౌంట్ మాత్రమే ఉన్నాయి. ఆంధ్రజ్యోతి నీరజ్ కుమార్ యొక్క క్రెడిబిలిటీ ని చెక్ చెయ్యకుండా వార్త రాయడం చూస్తుంటే ప్రభుత్వనికి మరక అంటించాలనే ఆత్రుత స్పష్టంగా కనపడుతుంది.

రమేష్ కుమార్ రాశారని చెబుతున్న లేఖ పై ఆంధ్రజ్యోతి, టీడీపీ కి ఉన్నంత శ్రద్ధ రమేష్ కుమార్ కి లేదు. మీడియా తనకు నచ్చినట్టుగా కథనాలు అల్లేస్తున్నా ఆయన స్పందించట్లేదు. ఈ మొత్తం వివాదానికి హేతుబద్ధమైన ముగింపు పలకవలసిన బాధ్యత రమేష్ కుమార్ పైనే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి