iDreamPost

RRR ఓటిటి – వ్యూస్ యుద్ధంలో విజేత ఎవరు

RRR ఓటిటి – వ్యూస్ యుద్ధంలో విజేత ఎవరు

గత నెల ఓటిటిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ ప్రకంపనలు మాములుగా లేవు. థియేటర్లలో 1100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ విజువల్ వండర్ అంతకు మించి అనేలా డిజిటల్ లో పెర్ఫార్మ్ చేస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ పంట పండింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో విదేశీ సెలబ్రిటీలు ట్రిపులార్ ని చూసి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. థియేట్రికల్ రన్ లో వంద రోజులకు దగ్గరగా ఉన్నఈ సినిమా ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు తమిళ మలయాళం కన్నడ వెర్షన్లు స్ట్రీమింగ్ చేసిన జీ5 వాస్తవానికి టాప్ లో ఉండాలి. కానీ వాస్తవానికి జరిగిందేంటో చూద్దాం

జీ5 మొత్తం 190 దేశాల్లో అందుబాటులో ఉంది. వాటి ద్వారా జీ5కి వచ్చిన వ్యూస్ 1000 మిలియన్ నిముషాలు. గంటల్లోకి మార్చుకుంటే 16,666,666 గంటలు. ఇది మూడు వారాల లెక్క. అదే నెట్ ఫ్లిక్స్ లో ఒక్క హిందీ డబ్బింగ్ వెర్షనే 39,480,000 గంటలు సాధించింది. అంటే రెండింటి మధ్య వ్యత్యాసం 22,813,334 గంటలు. దీన్ని బట్టి ఇంటర్నేషనల్ లెవెల్ లో నెట్ ఫ్లిక్స్ రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు నాలుగో వారంలోనూ ఇదే తరహా దూకుడు కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా రిపీట్ వ్యూస్ ఆర్ఆర్ఆర్ కు ప్లస్ గా మారాయి. ఇండియా విషయానికి వస్తే మాత్రం జీ5 డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఓవరాల్ గా నెట్ ఫ్లిక్స్ దే పై చేయి

రాటెన్ టొమాటోస్ సైట్ లో రేటింగ్ తెచ్చుకున్న మొదటి సౌత్ సినిమాగా ఆర్ఆర్ఆర్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. నిజానికి కెజిఎఫ్ 2 డిజిటల్ లోనూ ఆర్ఆర్ఆర్ ని దాటేస్తుందనే అంచనా ఉండేది కానీ ఇప్పుడది రివర్స్ అయ్యింది. ఫారినర్స్ కు రాఖీ భాయ్ అంతగా కనెక్ట్ కావడం లేదు రాజమౌళి చూపించిన ఎమోషన్ ప్రశాంత్ నీల్ ఇవ్వలేకపోయాడని వాళ్ళ ఫీలింగ్. దానికి తగ్గట్టే వ్యూస్ లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా వైడ్ టాప్ 10 ఓటిటి ప్రోగ్రాంస్ చూస్తే ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా కెజిఎఫ్ నాలుగో స్థానంలో ఉంది. దీనికన్నా ముందు మూడో ర్యాంకుతో బాలీవుడ్ డిజాస్టర్ జయేష్ బాయ్ జోర్దార్ ఉండటం అసలు ట్విస్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి