iDreamPost

అయ్యబాబోయ్.. ఆంధ్ర కృష్ణ, FBI కన్నా పవర్ ఫుల్..

అయ్యబాబోయ్.. ఆంధ్ర కృష్ణ,  FBI కన్నా పవర్ ఫుల్..

సర్ సర్ ఆంధ్ర కృష్ణ గారూ , ప్రధాని , ముఖ్యమంత్రి అంతరంగికంగా సంభాషించుకొన్నారు అని చెప్పారు కదా , మరి అవన్నీ మీకెలా తెలిశాయి .

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ….

దావోస్ లో కేంద్రం పాల్గొనలేదు కదా , మరి దావోస్ సర్వత్రా ఆందోళన వ్యక్తమైన సమాచారం మీకెలా తెలిసింది .

మా మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ సీబీఐ కి చెప్పాడు , సీబీఐ అమిత్ షా కి చెప్పింది . అమిత్ షా ప్రధానితో చర్చించేప్పుడు , ప్రధాని జగన్ ని మందలించెప్పుడు అక్కడే ఉన్న ఆంతరంగిక వర్గాలు వెల్లడించాయి .

ఎవరూ లేకుండా వాళ్లిద్దరే మాట్లాడుకున్నారు కదా ? . అంతరంగికులు ఎలా విన్నారు .

సోఫా చాటున , కర్టెన్ చాటున దాక్కున్నారులేవయ్యా . బందోబస్తు సినిమాలో సూర్య పాత్రని చూడలేదా? మనకోసం వాళ్ళలా కష్టపడతారు .

కియా పోతుందని గోల పుడుతుంది ఏంటి అని ప్రధాని అన్నాడంటున్నారు . కియా యాజమాన్యం మేమెక్కడికీ పోవట్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినాక ప్రధాని అడిగాడని మీరెలా చెబుతారు.

కియా యజమాన్యానికేం హక్కుంది మేము పోవట్లేదు అని చెప్పటానికి నేను పోతుంది అని రాసాక పోతున్నాం అని చెప్పాలి అంతే , పోము అని చెప్పినా నేను నమ్మను , నేను నమ్మలేదంటే ప్రధాని నమ్మడు . కనుక ప్రధాని అడుగుతాడు అడిగాడు అప్పుడే నేను రాసాను .

స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు లాంటి నిబంధనలు వలన కియా పోతుంది అన్నారు . అయితే కియాతో ఒప్పందం చేసుకొనేప్పుడు స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని బాబుగారు గతంలో ఒప్పందం చేసుకొన్నారు కదా ? ఆ విషయంలో వైసీపీని ఎలా తప్పుపట్టారు ప్రధాని ?

బాబు గారు సుదీర్ఘ అనుభవశాలి ఆయన ఏం చేసినా రాష్ట్రం యొక్క వెయ్యేళ్ళ భవిష్యత్ ని ఊహించి చేస్తారు , అందుకే ఆయన ఏం చేసినా రైటని ప్రధానికీ తెలుసు ?. అదే జగన్ అనుభవం లేని వ్యక్తి . అతను అలా చేస్తే ప్రధాని ఎందుకు ఒప్పుకొంటాడు . ఒప్పుకోకుండా ఆగ్రహ హావభావాలు వ్యక్తం చేశారు .

హావభావాలు కూడా ఎలా తెలిశాయి సారూ ?.

అప్పట్లో మా ఇంటలిజెన్స్ చీఫ్ బగ్స్ , ఇజ్రాయిల్ స్పై కెమెరాలు రాష్ట్రం కోసం తెప్పించెప్పుడు మనకీ నాలుగు ఎక్స్ ట్రా తెప్పించాడు . అవి వాడా . ప్రధాని ఇంట్లో బగ్స్ ఎలా పెట్టాలో బందోబస్త్ మూవీ చూసి తెలుసుకున్నా.. సక్సెస్ అయ్యా..

మరి పీఎం కార్యాలయంలో జామర్లు వాడి అవి పని చెయ్యనప్పుడు ఎలా కనిపెడతారు ?.

నేను టెలీపతి విద్య ద్వారా ఈ ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అన్నీ చూడగలను , వినగలను. ఆంతరంగిక గదుల్లో కూడా ఎవరేం చేసిన టెలీపతి ద్వారా తెలిసిపోతాయి.

ఆర్యా ఈ టెలీపతి విద్య ఏంటండీ అల్లోపతి హోమియోపతిలాగా ?.

కురుక్షేత్ర యుద్ధంలో ధృతరాష్ట్రుడికి, కొడుకు ఎలా యుద్ధం చేస్తుంది? ఎవరెవరు ఎలా ఓడిపోయారు అన్నీ ఈ విద్య ద్వారా చూసి దృతరాష్ట్రుడికి చెప్పేవాడు ఓ పెద్దాయన .

ఆ విద్య మీకెలా వచ్చు ?.

అప్పట్లో నేను కిరసనాయిల్ ఒరిస్సాకి స్మగుల్ చేసేవాన్ని , అక్కడ బస్తర్ లో మంత్రగాళ్ల దగ్గర ఈ విద్య నేర్చుకున్నా నేను. ఆ విద్యతోనే అన్నీ స్వయంగా చూసి రాసేది నేను .

ఓహో… ఏదేమైతేనేం ఆ రోజు ఆయన దృతరాష్ట్రుడికి దగ్గరుండి తండ్రీ కొడుకుల పతనాన్ని కళ్లారా కట్టి చూపినట్టే , ఈ రోజు మీరు ఈ తండ్రీ కొడుకుల్ని కూడా అన్నీ చూసినట్టే చెప్పి సాంతం నేల కరిపించారు అన్నమాట .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి