iDreamPost

వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇక మహిళలు! హ్యాపీగా DP పెట్టుకోవచ్చు!

పొద్దున నుండి సాయంత్రం వరకు ఎక్కువగా వినియోగించే యాప్ ఏదైనా ఉందంటే.. అది వాట్సప్. ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన యూజర్లు ఉన్న ఈ యాప్.. వినియోగదారుల గోపత్యను దృష్టిలో పెట్టుకుని.. సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తుంది. ఇప్పుడు..

పొద్దున నుండి సాయంత్రం వరకు ఎక్కువగా వినియోగించే యాప్ ఏదైనా ఉందంటే.. అది వాట్సప్. ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన యూజర్లు ఉన్న ఈ యాప్.. వినియోగదారుల గోపత్యను దృష్టిలో పెట్టుకుని.. సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తుంది. ఇప్పుడు..

వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇక మహిళలు! హ్యాపీగా DP పెట్టుకోవచ్చు!

లవర్‌తో చాట్ చేయాలన్నా, ఉద్యోగానికి రెస్యూమ్ పంపాలన్నా, దూరంగా ఉంటున్న అమ్మనాన్నలకు వీడియో కాల్ చేసి మాట్లాలన్నా, మన మనస్సులోని భావాలను వ్యక్త పరచాలన్నా.. ది బెస్ట్ ఛాయిస్‌గా మారిన యాప్ వాట్సాప్. సోషల్ మీడియా అలవాటు పడ్డ ప్రతి ఒక్కరూ.. మిగిలిన యాప్స్ అంత ఓపెన్ చేస్తారో లేదో కానీ.. ఈ అప్లికేషన్ మాత్రం వినియోగించకుండా ఉండలేరు. పొద్దున్న లేచిన దగ్గర నుండి గుడ్ మార్నింగ్ మేసేజెస్ దగ్గర నుండి.. చిన్న చిన్న వీడియో, ఆడియో సందేశాలు, ఫ్రెండ్స్ అండ్ లవర్ చాటింగ్ మేసేజెస్.. ఇక నచ్చిన కొటేషన్, సాంగ్స్ , డైలాగ్స్ పెట్టుకునేందుకు వాట్సప్ స్టేటస్ వంటి ఫీచర్స్ ఉండనే ఉన్నాయి. ఇక దూరంగా ఉన్న అమ్మ, నాన్నలు, అమ్మమ్మలు, తాతయ్యలతో మాట్లాడేందుకు వీడియో కాల్స్ ఆప్షన్ అదనం. ఇప్పుడు ఈ యాప్ లేకుండా రోజు గడవడమే కష్టంగా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ అప్లికేషన్‍ను విసృత్తంగా వినియోగిస్తున్నారు ప్రజలు. ఎప్పటి కప్పుడు అప్టేడెట్ చేస్తోంది మాతృ సంస్థ మెటా. వాయిస్ మెసేజెస్, గ్రూప్ కాలింగ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ క్రమంలో యూజర్ల వ్యక్తిగత గోప్యత చాలా ముఖ్యమని భావించిన ప్రముఖ సంస్థ.. మేసెజ్ చాట్ విషయంలో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ పరిచయం చేసింది. ఆ తర్వాత యూజర్ల ప్రైవసీకి ఇంపార్టెంట్ ఇస్తూ చాట్ లాక్ వంటి ఫీచర్లు తీసుకు వచ్చింది. ఇప్పుడు మరింత గోప్యతను దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్‌ను అందించబోతుంది మెటా సంస్థ. ఈ సారి యూజర్ ప్రొఫెల్ పిక్స్ విషయంలో జాగ్రత్త తీసుకోబోతుంది. సాధారణంగా వాట్సప్ ప్రొఫెల్ పిక్ ఎవ్వరూ చూడాలి.. ఎవ్వరూ చూడకూడదన్న ఆప్షన్ ఉంటుంది.

వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ప్రైవసీ, ప్రొఫెల్ ఫోటోపై క్లిక్ చేస్తే.. కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఎవ్రీవన్, నోబడీ, మై కాంట్రాక్ట్ ఆప్షన్లు క్లిక్ చేస్తే.. వారికి కనిపిస్తుంది. అయితే చాలా మంది కాంట్రాక్ట్ లేదా ఎవ్రీవన్ పెట్టుకుంటారు. దీని వల్ల కొంత నష్టం చేకూరుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు.. అమ్మాయి DP (డిసిప్లే పిక్చర్- ప్రొఫైల్ పిక్చర్) మార్చగానే.. వాటిని స్క్రీన్ షాట్ చేసుకుని.. సేవ్ చేసుకుంటున్నారు కొందరు ఆకతాయిలు. ఈ ఫోటోలను మార్ఫింగ్‌కు పాల్పడటం చేస్తున్నారు. ఈ విషయం వారికి తెలియదు. దీని వల్ల మహిళలు బాధితులయ్యారు. కేవలం మహిళలే కాదూ.. పలువురు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ డీపీ కనిపించడం వల్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో మెటా ఓ కీలక మార్పు చేయబోతుంది. పరిచయం ఉన్న వ్యక్తులు కూడా ప్రొఫైల్ పిక్ కొట్టేయకుండా దాచేయొచ్చు. ఇందు కోసం వాట్సప్ బీటాను వినియోగిస్తుంది. ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్స్ తీస్తే.. వెంటనే నియంత్రిస్తుంది బీటా. ఎందుకు స్క్రీన్ షాట్ పనిచేయదో చెబుతూ.. ఓ మేసెజ్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ వస్తే..ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్ నియంత్రించే తొలి యాప్ బహుశా ఇదే కావచ్చు. మొత్తానికి ఇకపై ఇతరులు ప్రొఫైల్ పిక్ చూడాలంటే సాధ్యం కాకపోవచ్చు. మరీ ఈ ఫీచర్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి