iDreamPost

సోషల్ మీడియాలో ఇదేం ప్రచారం

సోషల్ మీడియాలో ఇదేం ప్రచారం

నిజం నిద్రలేచే లోపు అబద్దం/పుకారు ఆకాశం దాకా వెళ్లి వస్తుందట. ఇది జంధ్యాల గారు ఓ సినిమా కోసం రాసిన డైలాగు. అప్పుడే కాదు ఇది ఎప్పటికైనా నూటికి నూరుపాళ్ళు నిజమయ్యే నానుడి. చిన్న లీక్ వస్తే చాలు దాని మీద చిలవలు పలవులు చేసి ప్రచారం చేయడం టెక్నాలజీ వచ్చాక మరీ ఎక్కువయ్యింది. నిన్న ఒక స్టార్ జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో మాములు హల్చల్ చేయలేదు. అది నాగ చైతన్య సమంతాలను ఉద్దేశించినట్టు ప్రచారం జరగడంతో అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మరోవైపు నేరుగా పేర్లను ప్రస్తావించకుండా ఈ జంట గురించి చాలా మాట్లాడుకున్నారు.

నిజానికి చైసామ్ లకు అలాంటి అభిప్రాయం ఉందో లేదో కానీ ఇలాంటి గాసిప్స్ వల్ల లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సమంతా ప్రత్యేకంగా ట్వీట్ చేయడం పట్ల అక్కినేని అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు. దీంతో ఈ వ్యవహారానికి చెక్ పెట్టినట్టు అయ్యిందని చెబుతున్నారు. ఇటీవలే సామ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేరుని సింపుల్ గా ఎస్ అని మార్చుకోవడం మొదలు ఇలాంటి పబ్లిసిటీకి పునాది పడింది. అందులోనూ లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి సామ్ ఎలాంటి ట్వీట్లు పెట్టకపోవడం అనుమానాలకు బలం చేకూర్చింది.

ఇప్పుడు ఇది నిజమా అబద్దమా అని చెప్పడం కాదు ఉద్దేశం. ఎలాంటి నిర్ధారణ లేకుండా ఇలా కంక్లూజన్ కు రావడమే సమర్ధనీయం కాదు. అలా అని చైతు సామ్ లు అర్జెంట్ గా ఖండించాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ అలా చేస్తే ఇకపై ప్రతి జంట మీద ఇలాంటి కథనాలు పుట్టుకొస్తాయి. వివరణలు ఇచ్చుకుంటూ పోతే దీనికి హద్దులు ఉండవు. తారల సినిమాలు పబ్లిక్ ప్రాపర్టీనే కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కాదు. అందుకే ఒకటి రెండు సార్లు వాళ్ళతో నేరుగా చెక్ చేసుకుని చెప్పుకుంటే బాగుంటుంది. ఫైనల్ గా సెప్టెంబర్ 7న దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందని మరో టాక్ ఉంది. చూద్దాం

Also Read : బాక్సాఫీస్ జోష్ సరిపోవడం లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి