iDreamPost

నాడు – నేడు : అసెంబ్లీలో చంద్రబాబు పూర్వ ప్రసంగం.. అప్పుడు మండలిపై బాబు ఏమన్నారంటే..

నాడు – నేడు : అసెంబ్లీలో చంద్రబాబు పూర్వ ప్రసంగం.. అప్పుడు మండలిపై బాబు ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాల అమలులో నాడు – నేడు అనే వినూత్నమైన అంశాన్ని అమలు చేస్తూ ప్రజలకు మార్పును చూపిస్తామంటున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ఈ విధానాన్ని రాజకీయాల్లో కూడా విజయవంతంగా వాడుకుంటోంది.

పథకాల అమలు, రాజకీయపరమైన నిర్ణయాల్లో ప్రతిపక్ష చంద్రబాబు అవలంభించిన వ్యతిరేక వైఖరిని నాడు – నేడు విధానం ద్వారా జగన్‌ సర్కార్‌ తిప్పికొడుతోంది. గతంలో జరిగిన శాసన సభ సమావేశాల్లో చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా చంద్రబాబు ప్రశంగ వీడియోలను సభలో ప్రదర్శిస్తూ ఆ హామీల అమలుపై విఫలమైన చంద్రబాబును ఎండగట్టింది. తాజాగా జరుగుతున్న సమావేశాల్లో కూడా ఇదే వ్యూహాన్ని జగన్‌ సర్కార్‌ కొనసాగించింది.

Read Also: మండలి రద్దు – నాడు ఎన్టీఆర్ సమర్థన

సోమవారం ఏపీ శాసన మండలి రద్దు తీర్మానంపై శాసన సభలో చర్చ జరుగుతోంది. మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శాసనసభ సమావేశాలకు గౌర్హాజరైంది. 1958లో ఏర్పాటైన ఏపీ శాసన మండలిని 1985లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో రెండుసార్లు టీడీపీ ప్రభుత్వం ఏర్పడినా శాసన మండలిని తిరిగి పునరుద్ధరించలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ 2006లో తిరిగి పునరుద్ధరించింది. ఇందుకు సంబంధించిన అసెంబ్లీ తీర్మానాన్ని 2004లోనే వైఎస్‌ సర్కార్‌ సభలో ప్రవేశపెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ శాసన మండలి వద్దంటూ ఆ ‘నాడు’ చంద్రబాబు మాట్లాడారు. ఆ వీడియోను ఇప్పుడు మండలి రద్దు సందర్భంగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సమయానుకూలంగా ఉపయోగించుకుంటూ ‘నేడు’ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతోంది.

Read Also: సజ్జల చెప్పిన 17 మంది ఎమ్మెల్యేలు.. టీడీపీలో మిగిలే ఆ నలుగురు ఎవరు..?

ఆ నాడు చంద్రబాబు శాసన సభలో మాట్లాడిన వీడియోను ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రదర్శించింది. ఈ రోజున (2004) శాసన మండలిని తిరిగి ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ఏమన్నారంటే.. ‘‘ అధ్యక్షా.. మండలి ఏర్పాటు వల్ల వీరి(కాంగ్రెస్‌) మనుషులు కొంత మందికి పదవులు వస్తాయన్న ఉద్దేశం తప్పా దీని వల్ల రాష్ట్రానికి లాభం లేదు. ప్రజలకు లాభం లేదు. వారి కార్యకర్తలకు, నాయకులకు రాజకీయ పునరావాసం కల్పిస్తారు గానీ దీని వల్ల బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనో లేదా రాష్ట్రానికి ప్రయోజనాలు వస్తాయనేది వాస్తవం కాదు. చరిత్రపరంగా చూసినా మండలి ఏమాత్రం అవసరం లేదు. ఒకప్పుడు శాసన సభకు చదువుకున్న వారు వచ్చే వారు కాదు. అందుకే శాసన మండలికి చదువుకున్న వారిని తీసుకొచ్చి చర్చలు జరిపేవారు. కానీ ఈ రోజు (2004) శాసన సభకు చదువుకున్న వారు, అనుభవజ్ఞనులు వచ్చారు.

1918లో మాన్ఫడ్‌ కమిటీ నివేదిక.. శాసన మండలి వస్తే శాసనాలు ఆలస్యమవుతాయి, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపింది. 1930 లో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాష్ట్రాలు కావాలంటే రెండో సభ పెట్టుకోవచ్చు గానీ దీని వల్ల లాభం ఉండదని కాంగ్రెస్‌ చెప్పింది. 1934లో బాబూ రాజేంద్రప్రసాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా హోదాలో రెండో సభ వల్ల ప్రజల డబ్బు వథా అవుతుందని, శాసనాలు ఆలస్యమవుతాయని, దీని వల్ల ఎలాంటి లాభం లేదని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చదవుకున్న వారు చాలా తక్కువ. అందుకే రాజ్యాంగంలో ఈ అవకాశం ఇచ్చిన విషయం మనమందరం గుర్తుపెట్టుకోవాలి.

Read Also: కౌన్సిల్‌ క్యాన్సిల్‌.. దారితీసిన పరిణామాలు… చంద్రబాబు చక్రం తిప్పుతారా..?

1950 నుంచి 8 రాష్ట్రాల్లో శాసన మండలి ఏర్పాడ్డాయి. కాలక్రమంలో మూడు రాష్ట్రాల్లో రద్దు అయ్యాయి. మరో ఐదు రాష్ట్రాల్లో మాత్రమే కొనసాగే పరిస్థితి వచ్చింది. దేశ స్థాయిలో రాజ్యసభ చాలా దేశాల్లో ఉంది. కానీ రాష్ట్ర మండలి లేవు. కాబట్టే పెట్టుకోలేదు. ఆర్థిక భారం పడుతుంది. బిల్లుల ఆమోదంలో ఆలస్యం జరుగుతుంది. దాదాపు 20 కోట్ల రూపాయల భారం పడుతుంది. బిల్లుల రూపకల్పనలో కాలయాపన జరుగుతుంది. ఇక్కడ నుంచి అక్కడకు ఒక బిల్లును పంపిస్తే.. అక్కడ చర్చ జరగడం. అది మళ్లీ తిప్పిపంపితే ఇక్కడ చర్చ జరగడం వల్ల కాలయాపన జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక బిల్లుల విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలంటూ ఏమీ లేవు. ఆర్థిక బిల్లులన్నీ శాసన సభే ఆమోదిస్తుంది.

ఏదైనా ఒక బిల్లు చట్టంగా కాకుండా అడ్డుకునే అధికారం మండలికి నాలుగు నెలలే ఉంటుంది. ఆ తర్వాత అటోమెటిక్‌గా అది చట్టంగా మారుతుంది. రాజ్యాంగ సవరణలు వచ్చినా.. శాసన సభకు తప్పా మండలికి ఏ ప్రమేయం లేదు. చివరకు రాష్ట్రపతి ఎన్నికలో కూడా మండలి సభ్యులకు ఓటు లేదు. లిమిటెడ్‌ పవర్స్‌ తప్పా లేదు. మేథావులు వస్తారని కూడా లేదు. మనం ఎవరిని పెడతామో తెలుసు. ప్రజా జీవితాలతో అడుకునేలా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేలా నిర్ణయాలు తీసుకోకూడదు.

Read Also: మండ‌లికి మంగ‌ళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం

ఏ మాత్రం ఉపయోగపడని శాసన మండలి బిల్లును ప్రవేశపెట్టడం వల్ల లాభం రాదు, ప్రజలకు నష్టం వస్తుంది. భారం అవుతుంది. శాసన మండలి వస్తే టైం ఎక్కువ అవుతుంది. అందుకే ఇది అవసరం లేదని ముఖ్యమంత్రి గారికి, శాసన సభా వ్యవహారాల మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్షా..’’ అని ఆ నాడు చంద్రబాబు శాసన మండలి పునరుద్ధరణను వ్యతిరేకించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి