iDreamPost

బాలీవుడ్ మూవీలో ప్రస్తుత వెస్టిండీస్ క్రికెటర్ నటించాడని మీకు తెలుసా?

  • Author Soma Sekhar Published - 09:53 PM, Fri - 14 July 23
  • Author Soma Sekhar Published - 09:53 PM, Fri - 14 July 23
బాలీవుడ్ మూవీలో ప్రస్తుత వెస్టిండీస్ క్రికెటర్ నటించాడని మీకు తెలుసా?

భారతదేశంలో క్రికెట్ తర్వాత.. మళ్లీ ఆ స్థాయి క్రేజ్ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే.. అది సినిమా పరిశ్రమ అనే చెప్పాలి. దాంతో ఈ రెండు రంగాలకు అవినాభావ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. దిగ్గజ క్రికెటర్ల జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో నటులే ఆటగాళ్ల పాత్రలు పోషిస్తారు. కానీ ప్రస్తుతం వెస్టిండీస్ కు ఆడుతున్న ఓ స్టార్ ప్లేయర్ బాలీవుడ్ సినిమాలో నటించాడని మీలో ఎంతమందికి తెలుసు? ఆ మూవీ టీమిండియా దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్ బయోపిక్. మరి ఈ మూవీలో నటించిన ఆ విండీస్ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1983.. ఈ సంవత్సరాన్ని క్రికెట్ గురించి తెలిసిన ఏ వ్యక్తీ మరచిపోడు. ఎందుకంటే.. టీమిండియా కపిల్ దేవ్ సారధ్యంలో 1983 ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఇక ఈ వరల్డ్ కప్ లో తన ఆల్ రౌండ్ ప్రతిభతో భారతదేశానికి ప్రపంచ కప్ ను అందించాడు కపిల్. ఈ వరల్డ్ కప్ సాధించిన ఇతివృత్తం ఆధారంగా బాలీవుడ్ ఇండస్ట్రీ తెరకెక్కించిన చిత్రం’83’. ఇక ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా పదుకోణె నటించారు. కబిర్ ఖాన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

కాగా.. ఈ సినిమాలో ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న, ప్రస్తుత విండీస్ క్రికెటర్ టగెనరైన్ చందర్ పాల్ నటించాడు. అప్పటి విండీస్ ప్లేయర్ లారీ గోమ్స్ పాత్రలో టగెనరైన్ చందర్ పాల్ నటించాడు. ఈ క్రమంలోనే లండన్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రణ్ వీర్, దీపికాలతో టగెనరైన్ చందర్ పాల్ ఓ సెల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి.. అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు టగెనరైన్ చందర్ పాల్.

ఇదికూడా చదవండి: యశస్వీ సెంచరీ ఇన్నింగ్స్.. ఎవరికి అంకితం చేశాడో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి