iDreamPost

యంగ్ కట్టప్ప కోసం ‘ఏఐ’ సాయం.. భారతీయ సినిమాల్లో ఇదే తొలిసారి!

  • Author singhj Published - 04:03 PM, Tue - 1 August 23
  • Author singhj Published - 04:03 PM, Tue - 1 August 23
యంగ్ కట్టప్ప కోసం ‘ఏఐ’ సాయం.. భారతీయ సినిమాల్లో ఇదే తొలిసారి!

ఇప్పుడు నడిచేది టెక్ యుగం. సాంకేతికత రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ మనిషి జీవనాన్ని మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటి ఉద్యోగాలన్నీ దాదాపుగా అన్నీ కూర్చొని చేసే జాబ్సే కావడం గమనార్హం. డెస్క్ ఉద్యోగాలు ఎక్కువైపోయాయి. అన్ని రంగాల్లోనూ కంప్యూటర్ల వినియోగం పెరిగింది. సాంకేతిక విప్లవం కారణంగా మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. జేబులో ఒక ఫోన్ ఉంటే చాలు.. అన్నీ ఉన్నట్లే. ప్రతిదీ ఫోన్ నుంచే ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తుంది. టెక్నాలజీ ఇంతగా మనుషుల జీవనంలో భాగం అయిపోయింది. అయినా సైంటిస్టులు సాంకేతిక రంగానికి సంబంధించి ఏదో ఒకటి కొత్తది కనిపెడుతూనే ఉన్నారు.

ఈమధ్య ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చాట్ జీపీటీతో పాటు మరికొన్ని ఏఐ టూల్స్ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఒక కోలీవుడ్ సినిమాలో కృత్రిమ మేధ సాయంతో ఒక పాత్రను యుక్త వయసులో ఉన్నట్లు చూపించనున్నారు. ‘బాహుబలి’ చిత్రంతో కట్టప్పగా అందరికీ చేరువయ్యారు సీనియర్ నటుడు సత్యరాజ్. ఆయన మెయిర్ రోల్​లో ‘వెపన్’ అనే ఓ తమిళ సినిమా తెరకెక్కుతోంది. అయితే సత్యరాజ్​కు ప్రస్తుతం 68 ఏళ్లు. కానీ ఈ మూవీలో ఏఐను ఉపయోగించి ఆయన 28 ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూపించనున్నారు. ఈ మూవీలో మొత్తం 1,200 సీజీఐ షాట్లు ఉంటాయట.

సాధారణంగా సినిమాల్లో నటీనటులను యంగ్​గా చూపించేందుకు పలు టెక్నాలజీలను వాడేవారు. కానీ ‘వెపన్’ డైరెక్టర్ గుహన్ సెన్నియప్పన్ తాజాగా ట్రెండింగ్​లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ను ఉపయోగించారు. దీంతో ఈ ఫిల్మ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పటిదాకా హాలీవుడ్ మూవీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి వాటిల్లో మాత్రమే ఏఐను వినియోగించారు. ఫస్ట్ టైమ్ ఇండియన్ మూవీస్​లో ఈ టెక్నాలజీని వాడుతుండటం విశేషం. తాజాగా ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వెపన్’ దర్శకుడు ఈ విషయాన్ని తెలిపారు. మూవీలో ఈ క్యారెక్టర్ కోసం ఐదుగురు సభ్యులు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి