iDreamPost

చంద్రబాబుతో అయిపోలేదు. లోకేష్‌ను కూడా విచారిస్తాము: CID చీఫ్

చంద్రబాబుతో అయిపోలేదు. లోకేష్‌ను కూడా విచారిస్తాము: CID చీఫ్

‘త్వరలో నన్ను అరెస్ట్ చేయబోతున్నారంటూ’ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను నిజం చేశారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు. నంద్యాల పర్యటనలో ఉండగా.. అక్కడకు వెళ్లిన పోలీసులు.. ఆయన్ను అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టు చేస్తున్నామని చంద్రబాబుకు చెప్పగా.. ఆ కేసులో తన పేరు లేదని, ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే తమ వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయని, రిమాండ్ తరలించాక చూపిస్తామని చెప్పారు. అనంతరం చంద్రబాబును అరెస్టు చేసి, తన కాన్వాయ్‌లోనే విజయవాడకు తరలించారు. ఇదిలా ఉంటే ఈ స్కాం వివరాలను మంగళగిరి డీజీపీ కార్యాలయంలో సీఐడీ అదనపు డీజీ ఎన్ సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. ఈ ఉదయం రూ.550 కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేశామని, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిల్క్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ. 371 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారని తెలిపారు.

కేబినేట్ ఆమోదం లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న ఆయన.. స్కాం చేసే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేసినట్లు తేలిందన్నారు. సీమెన్స్ కంపెనీ నుండి రూ. 550  పెట్టుబడి వస్తుందని పేర్కొంటూ.. ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లను అందించారు. ఆ డబ్బు అంతా ఆ డీల్ కుదిర్చిన డిజైన్ టెక్ తో సహా పలు షెల్ కంపెనీలకు లావాదేవీలు జరిగాయని అన్నారు. రూ.540 కోట్ల వ్యయం అయ్యే 6 సెంటర్ ఆఫ్ ఎక్‌లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకుని,  రూ.3 వేల కోట్లతో అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ.58 కోట్లతో సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. దీన్ని ఎక్కువ చేసి చూపించి కుట్రలకు తెరలేపారని అన్నారు.  ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో గంటా సుబ్బారావుకు 4 పదవులు ఇచ్చారు. అదేవిధంగా డిజైన్ టెక్ సీనియర్ అధికారి భార్యకు డిప్యూటీ సీఈఓగా నియమించారని సంజయ్ తెలిపారు.

ఈ మొత్తం స్కాం వెనుక కుట్రదారు చంద్రబాబునే అని సంజయ్ తెలిపారు. ఈ కేసు విచారణలో ఉండగా.. ప్రధాన నిందితులిద్దరూ విదేశాలకు పరారీలో ఉన్నారని, వారిని తిరిగి తెప్పిస్తామని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు కుమారుడు, ఏపీ మాజీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.  అలాగే కిలారు రాజేష్ అనే వ్యక్తితో నారా లోకేష్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వీరిని కూడా విచారిస్తామని తెలిపారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ ఖాతాల్లోకి వేసుకుని, అక్కడ నుండి చంద్రబాబు నాయుడు, నారాలోకేశ్, ఇతరుల ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయని తెలిపారు. ఈ స్కామ్ లో మాత్రమే కాకుండా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్, అమరావతి ఇన్నరింగ్ రింగ్ రోడ్ డైవర్షన్ అనే కేసుల్లోె నారా లోకేశ్ ప్రమేయంపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. లోకేష్‌ను కూడా విచారిస్తామన్నారు.  చట్టం ముందు తప్పించుకోలేరని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి