iDreamPost

మేము ఎలాంటి సర్వేలు చేయలేదు,పుకార్లు నమ్మొద్దు – iDream

మేము ఎలాంటి సర్వేలు చేయలేదు,పుకార్లు నమ్మొద్దు – iDream

గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ,పాలన ,సినిమా, పోలీస్ ,సామాజిక అంశాలు ఇలా అనేక రంగాలకు సంబంధించి ఇంటర్వ్యూలను చేసిన సంస్థ iDream.

అయితే ఐడ్రీమ్ ఏ విధమైన రాజకీయ , రేటింగ్ ఆధారిత సర్వే లను ఇప్పటివరకూ నిర్వహించలేదు . భవిష్యత్ కాలంలో ఏ విధమైన సర్వేలను నిర్వహించిన అధికారికంగా ప్రకటిస్తుంది .

ఈరోజు కొందరు వ్యక్తులు “iDream” సర్వేలో ఒక ఎమ్మెల్యేకు మొదటి రాంక్ వొచ్చిందని పేస్ బుక్ లో పోస్ట్లు పెట్టారు. ఈ ప్రచారంలో ఏ విధమైన వాస్తవం లేదని , అలాంటి వార్తలు నమ్మవద్దని iDream తరుపున తెలియజేస్తున్నాం .

ఇప్పటి వరకూ అలా ఎవరైనా ప్రచారం చేసుకొన్న సంఘటనలు మీకు తెలిస్తే మా దృష్టికి తీసుకురాగలరు .ఈ ప్రకటనను అలాంటి పోస్టుల మీద కామెంట్లో పెట్టగలరు. ఈ ప్రకటన తరువాత కూడా iDream సంస్థ పేరును ఎవరైనా దుర్వినియోగం చేసినచో వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకొంటాం అని తెలియజేస్తున్నాం .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి