iDreamPost

బంకులో భారీ మోసం.. పెట్రోల్‌కు బదులు నీళ్లు!

బంకులో భారీ మోసం.. పెట్రోల్‌కు బదులు నీళ్లు!

నేటికాలంలో సామాన్యుడి జీవితం చాలా దారుణంగా ఉంది. కారణం పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇంధన ధరలు. ఇవి మధ్యతరగతి కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు నింగివైపు పరుగులు తీస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.110పైనే ఉంది. ఇది చాలదన్నట్లు కొందరు పెట్రోల్ బంకుల యజమానులు అక్రమాలకు తెరలేపుతున్నారు. అసలుకే అధిక ధరతో సామాన్యుడు అల్లాడిపోతుంటే..  అది చాలదన్నట్లు వీరి మోసాలు తోడయ్యాయి. మంచిర్యాల  జిల్లాలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కి బదులు నీళ్లు వచ్చాయి. దానిని చూసిన వాహనదారులు షాక్ కు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇప్పటి వరకు సాంకేతిక సాయంతో తక్కువ పెట్రోల్ కొట్టి..మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చూశాము. తాజాగా మాత్రం అంతకుమించి అన్నట్లు ఓ ఘరానా మోసం బయట పడింది. మంచిర్యాల పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో  ఓ వాహనదారుడు పెట్రోల్  కొట్టించుకునేందుకు వెళ్లాడు. అయితే తన బండిలో పెట్రోల్  కొట్టిస్తున్న సమయంలో అతడికి ఓ అనుమానం వచ్చింది. సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తున్నప్పుడు.. వాహనం ట్యాంక్ నుంచి ఆవిరి వస్తుంటుంది.

కానీ.. ఆ బంకులో పెట్రోల్  కొడుతుంటే మాత్రం ఎలాంటి ఆవిరి రాకపోవడాన్ని సదరు వ్యక్తి గమనించాడు. దీంతో వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్లి.. ఓ వాటర్ బాటిల్ తెచ్చాడు. అందులో  పెట్రోల్ కొట్టాలని.. అక్కడి సిబ్బందికి చెప్పాడు. వాళ్లు ఒప్పుకోకపోవడంతో.. సదరు వాహనదారుడు సీరియస్ అయ్యాడు. మీరు పెట్రోల్ బదులు నీటిని వాహనాల్లోకి కొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాహనదారుడు మాటలకు సిబ్బంది.. బాటిల్‌లో పెట్రోల్ కొట్టక తప్పలేదు. దీంతో అసలు బాగోతం బయట పడింది. అతడు చెప్పినట్లే పెట్రోల్‌కు బదులు అందులో నుంచి నీళ్లు వచ్చాయి.

దీంతో పక్కనే ఉన్న తోటి వాహనదారులు కూడా షాకయ్యారు. అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే బంకులో పెట్రోల్ కొట్టించుకున్న పలువురు వాహనదారులు అక్కడకు చేరుకున్నారు. బంకులో పెట్రోల్ కొట్టిస్తే.. తన రూ. 20 లక్షల కారు రోడ్డుపై ఆగిపోయిందని ఓ వాహనదారుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో పెట్రోల్ బంకు యజమానులపై  దాడి చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వర్షంతో హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్.. ఈ రూట్లలో అస్సలు వెళ్లకండి!

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి