iDreamPost

4 రోజుల్లో పెళ్లి.. అంతా పెళ్లి కొడుకు లేచిపోయాడు అనుకున్నారు. కట్ చేస్తే!

Krishna Teja Missing Case: హన్మకొండకు చెందిన వరుడు కృష్ణ తేజ మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నాలుగురోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్లికొడుకు కనిపించకుండా పోయాడు.

Krishna Teja Missing Case: హన్మకొండకు చెందిన వరుడు కృష్ణ తేజ మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నాలుగురోజుల్లో పెళ్లి పెట్టుకుని పెళ్లికొడుకు కనిపించకుండా పోయాడు.

4 రోజుల్లో పెళ్లి.. అంతా పెళ్లి కొడుకు లేచిపోయాడు అనుకున్నారు. కట్ చేస్తే!

వరంగల్ లో కృష్ణ తేజ అనే యువకుడు మిస్సింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నాలుగురోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన హన్మకొండకు చెందిన కృష్ణతేజ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లిన తమ కుమారుడు కనిపించడం లేదంటూ కృష్ణతేజ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు ఎస్సారెస్పీ కెనాల్లో కృష్ణతేజ మృతదేహాన్ని గుర్తించారు. కనిపించకుండా పోయిన తమ కుమారుడు ఎలాగైనా తిరిగి వస్తాడంటూ కోటి ఆశలు పెట్టుకున్న ఆ కుటంబానికి కన్నీళ్లే మిగిలాయి. పెళ్లి కుమారుడిగా ముస్తాబవ్వాల్సిన కొడుకు మృతదేహంగా తిరిగి వచ్చాడు.

వరంగల్ లో వరుడు మిస్సింగ్ కేసు సంచనలంగా మారిన విషయం తెలిసిందే. హన్మకొండకు చెందిన కృష్ణతేజకు వర్దన్నపేటకు చెందిన మౌనిక అనే యువతితో ఈ నెల 16న పెళ్లి పెట్టుకున్నారు. తన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు కృష్ణతేజ కార్డులు పంచుతున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం నుంచి పెళ్లికుమారుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పెళ్లికార్డులు పంచడానికి వెళ్లిన కృష్ణ తేజ తిరిగి ఇంటికి రాలేదు. పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్లిన తమ కుమారుడు తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబం కంగారు పడింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కృష్ణ తేజ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణతేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ముందుగా పోలీసులు కృష్ణ తేజ ద్విచక్రవాహనాన్ని గుర్తించారు. ఆ తర్వత వర్దన్నపేట మండలం కుమ్మరిగూడెం సమీపంలోని ఎస్సార్ఎస్పీ కెనాల్ లో కృష్ణ తేజ మృతదేహాన్ని గుర్తించారు. నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు విగతజీవిగా మారాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టాడు. ఇది ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణతేజకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెబుతున్నారు. ఈ పెళ్లి నిశ్చయానికి ముందే కుంటుంబంతో తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని కృష్ణతేజ చెప్పాడు అంటున్నారు. అతను హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడే ఒక యువతిని ప్రేమించినట్లు తెలుస్తోంది. ఇష్టంలేని వివాహం చేసుకోలేక కృష్ణతేజ బలవన్మరణానికి పాల్పడినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Warangal bride missing

తనకు ఈ పెళ్లి ఇష్టంలేదంటూ ప్రేమించిన అమ్మాయితో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి అంటున్నారు. తన మిత్రులతో కూడా తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రేమించిన యువతి కూడా కృష్ణతేజను వేరే అమ్మాయిని ఎలా వివాహం చేసుకుంటావు అంటూ నిలదీసినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన కృష్ణతేజ ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. కృష్ణతేజ మరణవార్త తెలియగానే కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్నారు. పెళ్లికొడుకుని చేయాల్సిన తమ కుమారుడిని ఇలా విగతజీవిగా చూడటంతో వాళ్లు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఎదిగొచ్చిన కొడుకు తమకు తమకు ఆధారంగా ఉంటాడు అనుకున్న కుమారుడు ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ విలపిస్తున్నారు. పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటాడనుకుంటే.. ఇలా కుటుంబాన్ని బాధ పెడతాడు అనుకోలేదు అంటూ వాపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి