iDreamPost

దేవినేని అతి తెలివి చూపిస్తున్నాడా ?

దేవినేని అతి తెలివి చూపిస్తున్నాడా ?

ఇరిగేషన్ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అతి తెలివి చూపిస్తున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. దేవినేని వైఖరి ఎలాగుందంటే కిందపడ్డా తమదే పై చేయి అన్నట్లుగా ఉంది ఆయన మాటలు. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు అనే అంశంపై మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు దేవినేని కి మధ్య వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు 70 శాతం పనులు కాకుండానే అయిపోయినట్లు టిడిపి చెప్పుకుంటోందంటూ అనీల్ ఆరోపించారు. 70 శాతం పనులు పూర్తయినట్లు నిరూపిస్తే తాను మీసాలు తీసేస్తానంటూ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే.

దేవినేని చెప్పుకుంటున్నట్లు 70 శాతం పనులు చేయలేదని నిరూపిస్తే మాజీ మంత్రి మీసాలు తీసేస్తాడా ? అంటూ సవాలు విసిరారు. దానికి దేవినేని సమాధానమిస్తు సాగునీటి సమీక్షలో పోలవరంలో 71.43 శాతం పనులు పూర్తియినట్లు గుర్తించలేదా ? అంటూ నిలదీశాడు. అలాగే టిడిపి ఎంపి కేశినేని నాని అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో సమాధానమిస్తు పోలవరంలో 69.54 పనులు పూర్తయినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పిన సమాధానాన్ని గుర్తుచేశాడు.

ఇక్కడే దేవినేని అతితెలిలవి బయటపడుతోంది. పోలవరంలో 70 శాతం పనులు పూర్తవ్వలేదని మంత్రి కూడా అనలేదు. కాకపోతే పూర్తియిన 70 శాతం పనుల్లో టిడిపి చేసిందెంత అనేదే ఇక్కడ ప్రశ్న. 2014లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చేనాటికే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అంటే 2014కు ముందు పోలవరంలో అయిన పనులెంత ? 2014-19లో చంద్రబాబు హయాంలో జరిగిన పనులెంత ? అన్నదే ప్రధాన ప్రశ్న. గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు హయాంలో జరిగిన పనులే టిడిపి చేసినట్లు లెక్క.

పార్లమెంటులో మంత్రి చెప్పినా, సాగునీటి సమీక్షలో అధికారులు చెప్పినా 70 శాతం పనులు అయ్యాయని చెప్పారంటే అయిన పనులు ఎంత అన్నపుడు వచ్చిన లెక్కది. అంతేకానీ జరిగిన 70 శాతం పనులు కేవలం 2014-19 మధ్యే జరిగినట్లు కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇతరులు చేపట్టిన పనులు కూడా తన ఖాతాలో వేసేసుకోవటం చంద్రబాబుకున్న అలవాటు.

రాష్ట్ర విభజనకు ముందే ఉద్యోగులకు 43 శాతం పిఆర్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. విభజన జరిగిన తర్వాత ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించిన చంద్రబాబు 43 శాతం పిఆర్సీ ఇచ్చినట్లు ప్రకటించుకున్నాడు. నిజానికి 2014కు ముందే 2009లో సిఎం అయిన రోశయ్య 14 శాతం ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మరో 15 శాతం ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సిఎం అయిన చంద్రబాబు మిగిలిన 14 శాతం ప్రకటించారు. అంటే చంద్రబాబు 14 శాతం మాత్రమే ఇచ్చి మొత్తం 43 శాతం తానే ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకున్నారు. ఇపుడు పోలవరంలో అయిన పనులు కూడా ఇలాగే క్లైం చేసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి