iDreamPost

అతడికి బౌలింగ్ చేయాలంటే మాకు వణుకు.. మోస్ట్ టఫెస్ట్ బ్యాటర్: రబాడ

వరల్డ్ క్రికెట్ లో అతడు మోస్ట్ టఫెస్ట్ బ్యాటర్ అని, అతడికి బౌలింగ్ చేయాలంటే కొన్ని కొన్ని సార్లు మాకు వణుకుపుడుతుందని స్టార్ ప్లేయర్ గురించి పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు డేంజరస్ బౌలర్ కగిసో రబాడ. ఆ వివరాల్లోకి వెళితే..

వరల్డ్ క్రికెట్ లో అతడు మోస్ట్ టఫెస్ట్ బ్యాటర్ అని, అతడికి బౌలింగ్ చేయాలంటే కొన్ని కొన్ని సార్లు మాకు వణుకుపుడుతుందని స్టార్ ప్లేయర్ గురించి పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు డేంజరస్ బౌలర్ కగిసో రబాడ. ఆ వివరాల్లోకి వెళితే..

అతడికి బౌలింగ్ చేయాలంటే మాకు వణుకు.. మోస్ట్ టఫెస్ట్ బ్యాటర్: రబాడ

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ.. అందులో కొందరు అంటేనే బౌలర్లకు వణుకు పుడుతుంది. వారికి బౌలింగ్ వేయలంటే పోటు బౌలర్  అయినా జంకాల్సిందే. అలాంటి బ్యాటర్లు వరల్డ్ క్రికెట్ లో చాలా తక్కువ మందే ఉంటారు. వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఏబీడీ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే అవుతుంది. కాగా.. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సౌతాఫ్రికా డేంజరస్ బౌలర్, పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అతడు మోస్ట్ టఫెస్ట్ బ్యాటర్ అంటూ కితాబిచ్చాడు. మరి ఆ బ్యాటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కగిసో రబాడ.. వరల్డ్ క్లాస్ బెస్ట్ బౌలర్లలో ఒకడు. తన స్పీడ్ పేస్ తో బ్యాటర్లకు వణుకు పుట్టించగల సమర్థుడు. అందుకే అతడంటే ప్లేయర్లకు హడల్. ప్రస్తుతం సౌతాఫ్రికా టీమ్ లో స్టార్ ప్లేయర్ గా వెలుగొందుతున్న రబాడకి ఓ టీమిండియా బ్యాటర్ అంటే భయమట. హేమాహేమీ ఆటగాళ్లకే చెమటలు పట్టించిన రబాడకు చెమటలు పట్టించింది ఎవరో కాదు.. టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే టఫెస్ట్, డేంజరస్ బ్యాటర్ అంటూ ‘విల్లో టాక్’ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘విల్లో టాక్’ పాడ్ కాస్ట్ లో కగిసో రబాడ మాట్లాడుతూ..”నేను చాలా మంది బ్యాటర్లకు బౌలింగ్ చేశాను. కానీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ను చూడలేదు. అతడు అద్భుతమై బ్యాటర్. మూడు ఫార్మాట్లలో అత్యంత ప్రమాదకరమైన, నిలకడైన ఆటగాడు కోహ్లీ. ఒక్కసారి క్రీజ్ లో కుదురుకుంటే.. అతడిని ఆపటం కష్టం. విరాట్ కు బౌలింగ్ చేయాలంటే కొన్ని కొన్ని సార్లు మాకు వణుకుపుడుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పాడ్ కాస్ట్ మధ్యలో విరాట్ వచ్చి రబాడను సర్ఫ్రైజ్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న రబాడ.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడి.. 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా.. గురువారం పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.

 

View this post on Instagram

 

A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి