iDreamPost

నిన్న హామీ ,నేడు అమలు.. సూపర్ సీఎం గారు

నిన్న హామీ ,నేడు అమలు.. సూపర్  సీఎం గారు

విశాఖ దుర్ఘటన అందరినీ కలచివేసింది. అదే సమయంలో వైఎస్ జగన్ పాలనా తీరుని ప్రజలందరికీ చాటిచెప్పింది. నిర్ణయం తీసుకోవడంలోనూ, హామీ ఇచ్చిన అమలు చేయడంలోనూ జగన్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపించింది. రాజకీయంగా జగన్ వ్యతిరేకులకు కూడా ఈ విషయంలో ఆయన పెద్ద మనసుని చూసి అభినందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు లాంటి ఏ కొందరో మినహా దాదాపుగా అందరూ ప్రభుత్వ వ్యహారాన్ని మెచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో నెం. 449 ని విడుదల చేసింది. విశాఖ కలెక్టర్ నుంచి లేఖ ఆధారంగా ఈ జీవో విడుదల చేశారు. దాని ప్రకారం విశాఖ గ్యాస్ లీక్ లో బాధితులకు రూ. 30 కోట్లను విడుదల చేశారు. మృతులు, అస్వస్థతకు గురయిన వారందరికీ నష్టపరిహారం కింద అందించేందుకు సీఎంఆర్ఎఫ్ ఈ నిధులు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున సహాయం అందించబోతున్నట్టు సీఎం జగన్ నిన్న విశాఖలో ప్రకటించారు. ముఖ్యమంత్రి నోటి మాటను 24 గంటల్లనే ఆచరణలోకి తీసుకొచ్చి మరునాడే బాధితులకు నష్టపరిహారం అందించేటంత వేగంగా అధికార యంత్రాంగం పరుగులు పెట్టడం విశేషంగానే చెప్పవచ్చు.

Also Read:కంపెనీల మధ్య పోటీ…వ్యాక్సిన్‌ భద్రమేనా…?

మృతుల కుటుంబాలతో పాటుగా ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స పొందిన వారికి రై. 25వేల చొప్పున అందించబోతున్నారు. ఆసుపత్రిలో 2,3 రోజులు చికిత్స పొందాల్సిన పరిస్థితి ఉన్న ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున అందిస్తారు. ఇక వెంటిలేటర్ మీద చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడిన వారికి రూ. పది లక్షల వంతును అందిస్తామని నిన్న సీఎం చెప్పడం, నేడు అది ఆచరణ రూపం దాల్చడం అందరినీ ఆకట్టుకుంటోంది. వాటితో పాటుగా ఎల్జీ పాలిమర్స్ సమీప గ్రామాల్లోని 15వేల కుటుంబాలకు పది వేల రూపాయల చొప్పున అందించేందుకు గానూ విశాఖ కలెక్టర్ కి నిధులు అందించడానికి విడుదల చేసిన జీవో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

గతంలో గోదావరి పుష్కరాల్లో మృతులకు చంద్రబాబు ప్రభుత్వం 29 మంది మృతులకు పది లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. కానీ దానిని రెండేళ్లు గడిచినా అందించకపోవడంతో అప్పట్లో పలువురు బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళీడ్చుకుంటూ తిరగాల్సి వచ్చింది. ఇతర అనేక సందర్భాల్లో కూడా బాధితులకు నష్టపరిహారం విషయంలో జరిగిన జాప్యం అంతా ఇంతా కాదు. కానీ జగన్ పాలనలో అనూహ్యంగా మాట ఇచ్చిన మారునాడే అమలులోకి వచ్చిన నష్టపరిహారం బాధితులకు చేరడం పాలనా విధానంలో పెద్ద మార్పుగా చెప్పవచ్చు. జగన్ మార్క్ పాలనకు అద్దంపట్టే ఘటనగా ఇది నిలిచిపోతుందని అంతా భావిస్తున్నారు.

Also Read:మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి మృతి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి