iDreamPost

USలో మరో భారతీయుడి హత్య.. ఇండియన్సే వాళ్ల టార్గెటా?

అమెరికాలో భారతీయులపై దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో భారతీయుడు దుండగుడి దాడిలో హత్యకు గురయ్యాడు. వరుస దాడులతో ఎన్నారై కుటుంబాలు భయంతో వణికిపోతున్నారు.

అమెరికాలో భారతీయులపై దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో భారతీయుడు దుండగుడి దాడిలో హత్యకు గురయ్యాడు. వరుస దాడులతో ఎన్నారై కుటుంబాలు భయంతో వణికిపోతున్నారు.

USలో మరో భారతీయుడి హత్య.. ఇండియన్సే వాళ్ల టార్గెటా?

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దుండగులు జరుపుతున్న వరుస దాడులతో పలువురు భారతీయులు మృత్యువాత పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాదీ విద్యార్ధిపై యూఎస్ లోని చికాగోలో దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు నలుగురు ఇండియన్స్ ను పొట్టనబెట్టుకున్నారు దుండగులు. తాజాగా మరో భారతీయుడు అమెరికాలో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల భారతీయ విద్యార్థులపై, భారత సంతతికి చెందిన వ్యక్తులపై దాడులు జరుగుతున్న తీరును చూస్తే ఇండియన్సే వాళ్ల టార్గెటా అన్న సందేహాలు భారతీయుల్లో కలుగుతున్నాయి. అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారత్ నుంచి అమెరికాకు విద్యా, ఉద్యోగాల నిమిత్తం చాలామందే వెళ్తుంటారు. తాజాగా యూఎస్ లో జరుగుతున్న దాడులతో అమెరికా పయనమంటేనే వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. యూఎస్ లో జాత్యాహంకార దాడులు తీవ్ర కలకలంరేపుతున్నాయి. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన వివేక్‌ తనేజా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఈ నెల 2న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వర్జీనియాలో నివాసముంటున్న వివేక్‌ అమెరికాలో వ్యాపార వేత్తగా రాణిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 2న వాషింగ్టన్‌ డౌన్‌టౌన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం జరిగింది.

ఆ గొడవ పెద్దదిగా మారి భౌతిక దాడులకు దారితీసింది. ఆ దాడిలో దుండగుడు వివేక్‌ తలపై దాడి చేశాడు. వివేక్‌ను విచక్షణా రహితంగా కొట్టి గాయపరిచాడు. ఆ దాడిలో వివేక్ తలకు తీవ్ర గాయమవ్వడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ వివేక్‌ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి