iDreamPost

విశ్వక్ సేన్ బాలయ్యని మరిపిస్తాడా? ఇది సాహసమే!

  • Published Jan 29, 2024 | 3:10 PMUpdated Jan 29, 2024 | 3:22 PM

ఇండస్ట్రీల్లో విభిన్నాత్మక పాత్రల్లో అలరించడమంటే పెద్ద సహసమనే చెప్పాలి. మరి అలాంటి పాత్రల్లో అలరించడానికి ఓ యంగ్ హీరో సిద్ధమయ్యాడు. ఇంతకి ఆయన ఏ పాత్రల్లో కనిపించబోతున్నరంటే..

ఇండస్ట్రీల్లో విభిన్నాత్మక పాత్రల్లో అలరించడమంటే పెద్ద సహసమనే చెప్పాలి. మరి అలాంటి పాత్రల్లో అలరించడానికి ఓ యంగ్ హీరో సిద్ధమయ్యాడు. ఇంతకి ఆయన ఏ పాత్రల్లో కనిపించబోతున్నరంటే..

  • Published Jan 29, 2024 | 3:10 PMUpdated Jan 29, 2024 | 3:22 PM
విశ్వక్ సేన్ బాలయ్యని మరిపిస్తాడా? ఇది సాహసమే!

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు విభన్న కథలను ఎంచుకొని విభన్న పాత్రల్లో అలరించడమనేది ట్రెండ్ గా మారింది. అయితే సినిమాలో కథ ఎలా ఉన్నా హీరో పాత్ర, లుక్ ముఖ్యం అంటున్నా రోజుల్లో.. ప్రయోగాత్మక పాత్రల్లో అలరిస్తు పెద్ద సహసమే చేస్తున్నారు. సాధారణంగా హీరోలు ప్రయోగాత్మక పాత్రాలు చేయడమనేది చాలా కష్టం. ఇలా చేయడం వలన సినిమా హిట్ అయితే పర్వాలేదు కానీ, డిజాస్టర్ గా మిగిలితే అనేక ట్రోల్స్ బారిన పడతారు. ఇప్పటికే ఇలాంటి విభిన్నాత్మక పాత్రలు అనేవి ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు చేశారు. అయితే తరుచుగా లవ్ స్టోరిస్ లో అలరించిన ఓ యంగ్ హీరో మాత్రం ఇందుకు భిన్నంగా ప్రయోగాత్మక పాత్రల్లో నటించబోతున్నాడు. అది కూడా గతంలో బాలయ్య చేసిన అఘోర పాత్రకు సిద్ధమయ్యాడు. ఇంత సహసం చేస్తున్న ఆ కుర్ర హీరో ఎవరంటే..

మాస్ ఎండ్ క్లాస్ లవ్ స్టోరిస్ లో అలరిస్తూ సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నా ఆ యంగ్ హీరో సడన్ గా  ప్రయోగాత్మక పాత్రను పోషించబోతున్నాడు. అది కూడా ఏకంగా అఘోరా పాత్రకు సిద్ధమయ్యారు అంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఇప్పుడు అలాంటి పెద్ద సహసం చేసిన కుర్ర హీరో ఎవరంటే.. అతనే మన టాలీవుడ్ హీరో విశ్వక్‌సేన్. ఈయన గతంలో ‘గామి’ అనే పేరుతో ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ, ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు విశ్వక్. ఇక ఆ పోస్టర్ లోని విశ్వక్ అఘోరాగా కనిపించాడు. ఇది చూసిన ప్రేక్షకులు, అభిమానులంతా ఒక్కసారిగా షాక్ కి గురియ్యారు.

అయితే తెరమీద ఇలా అఘోరా పాత్రలో కనిపించడం అనేది చాలా రిస్క్ అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో అఘోరా పాత్రలో కనిపించగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే 30 ఏళ్ల క్రితం ‘కాష్మోరా’ అనే సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ అఘోరా పాత్రలో అద్భుతంగా నటించిన అది ప్రేక్షకుల్లో అంతగా అదరణ లభించలేదు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ‘శ్రీ మంజునాథ’ సినిమాల్లో సేమ్ గెటప్ లో కనిపించగా.. అది కూడా ఇంచుమించు అదే రిజల్ట్ కనిపించింది. మరి, ఇప్పుడు విశ్వక్ ఈ సహసం చేయడమనేది విశేషం అని చెప్పాలి. కాగా, గామి సినిమాలో అఘోరాలా కనిపిస్తున్న విశ్వక్ పై ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలా అదరిస్తారనేది చూడాలి. మరి, అఘోర పాత్రలో కనిపించనున్న విశ్వక్ పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి