iDreamPost

Vishwak Sen అమ్మా నీ కొడుక్కి ఏం కాదు, ఏం పీకలేరు. మోకాళ్ల మీద కూర్చొని విశ్వక్ సేన్ ఎమోషనల్

Vishwak Sen అమ్మా నీ కొడుక్కి ఏం కాదు, ఏం పీకలేరు. మోకాళ్ల మీద కూర్చొని విశ్వక్ సేన్ ఎమోషనల్

టీవీ9 యాంకర్ తో వివాదం త‌ర్వాత విశ్వ‌క్ సేన్ ఎమోష‌న‌ల్ అయ్యారు. విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు ఖమ్మంలో గ్రాండ్‌గా జరిగింది. అందులో ఆయ‌న కేర‌క్ట‌ర్ పేరు అర్జున్ అల్లం.

నాజీవితంలో నేను సమాధానం చెప్పుకోవ‌ల‌సిన వ్య‌క్తి ఒక్క‌రే ఉన్నారు. ఆమె మా అమ్మ‌. అమ్మా, నీ కుమారునికి ఏం కాదు. ఎవ్వ‌రు ఏం చేయ‌లేరు అంటూ హీరో భావోద్వేగానికి లోన‌య్యారు.

’అమ్మా నీకు ఒకటి చెబుతున్నా. నీ కొడుక్కి ఏం కాదు. ఏం పీకలేరు. అమ్మాయిలకు నేను రెస్పెక్ట్ ఇవ్వనని అంటున్నారు. అదే నిజమైతే, ఆ రోజు స్టూడియోలో అలా వచ్చి ఉండేవాడిని కాదు. నీ కొడుక్కి నువు నేర్పిన సంస్కారం తెలుసు. నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. చిన్న ఈగలాంటివాడిని. నలుగురు కలిపి కొడితే పడిపోతాను. నాకు రక్షణగా మీరున్నారు. మీరు పెట్టిన మెసెజ్‌లు చేశాను.. మీరే నా ఆస్తి. నన్ను ఎవ్వరూ ఏం పీకలేరని అనిపించింది. నాకు మీరున్నారు. డౌట్ వస్తే, హ్యాష్ ట్యాగ్ విశ్వక్ సేన్ అని కొట్టి చూడండని చెబుతాను’ అని ఎమోషనల్ హీరో అయ్యాడు.

నా సినిమా కష్టాల గురించి ఇంత వరకు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్లో హీరో అవుతాను అని చెబితే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. నన్ను మాత్రం మా అమ్మ నమ్మింది. ఆ తరువాత నాన్న. ఎంతో కష్టపడి ఫిల్మ్ కోర్సులు నేర్చుకున్నా. డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ నేర్చుకున్నాను. 12 లక్షలు పెట్టి, వెళ్లిపోమాకే సినిమా చేశాను. నిర్మాతకు నచ్చి కొని రిలీజ్ చేశాడు. అదే పెద్ద సక్సెస్.. నా దగ్గర ఏం లేని సమయంలో తరుణ్ భాస్కర్ నన్ను పెట్టి సినిమా తీశాడు. ఆయనకు థ్యాంక్స్.

ఆ తరువాత ఫలక్ నుమా దాస్ నేను తీసుకున్నా. మీడియా మీ దగ్గరకు నన్ను తీసుకొచ్చింది. సినిమా తీస్తే, అది నచ్చితే, ఇంత బాగా ఆదరిస్తారా? ఇంత‌టి స్థానం ఇస్తారా? ఇంకేం ప్రాబ్లం ఉంటయ్ రా అని అనుకున్నా. ఎదుగుదల అంటే.. ఓ ప్రాబ్లం వచ్చినప్పుడు దాక్కోెవడం కాదు. దాన్ని తన్ని, ఇలా ఖమ్మంలోకి వచ్చి, ఇలా మీతో నవ్వడం, నన్ను ఎవరో అన్నారని, వేలెత్తి చూపించారని నాకు బాధలేదు అంటూ టీవీ9తో వివాదంపై వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లుగా హీరో మాట్లాడారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి