iDreamPost

విశ్వక్- ఆయేషా ఖాన్ మాస్ బీట్.. యూట్యూబ్ లో మోత మోగిపోతోంది..!

Viswak Sen- Ayesha Khan Song: మాస్ కా దాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి అదిరిపోయే మాస్ బీట్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో ఆయేషా ఖాన్ ఏకంగా విశ్వక్ సేన్ ని కూడా డామినేట్ చేసేసింది.

Viswak Sen- Ayesha Khan Song: మాస్ కా దాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి అదిరిపోయే మాస్ బీట్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో ఆయేషా ఖాన్ ఏకంగా విశ్వక్ సేన్ ని కూడా డామినేట్ చేసేసింది.

విశ్వక్- ఆయేషా ఖాన్ మాస్ బీట్.. యూట్యూబ్ లో మోత మోగిపోతోంది..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల గామితో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. 8 ఏళ్లపాటు వాళ్లు పడిన కష్టానికి ఆడియన్స్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. పాన్ ఇండియా లెవల్లో గామి ఒక కొత్త చరిత్ర అని బడా బడా మేకర్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ మాస్ హీరో అసలు సిసలైన మాస్ బీట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 17న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన ఒక మాస్ బీట్ యూట్యూబ్ ని మోత మోగిస్తంది. ఈ మాస్ బీట్ చూసిన ఫ్యాన్స్ బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ కి అభిమానులు అయిపోతున్నారు.

విశ్వక్ సేన్- నేహా శెట్టి- కృష్ణ చైతన్య కాంబోలో వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మార్చి 8నే రిలీజ్ కావాల్సింది. కానీ, అప్పటి షూటింగ్ పూర్తి కాలేదు అని రిలీజ్ ని వాయిదా వేశారు. కానీ, అభిమానులను నిరాశ పరచకుండా విశ్వక్ సేన్ గామితో వచ్చాడు. ఇప్పుడు ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని మే 17న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సుట్టంలా సూసి పోకలా.. సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ ని షేక్ చేస్తూనే ఉంది. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ ఒక మాస్ మసాలా బీట్ ని రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో మొదట చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ, చివరికి బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ నటించింది.

మోత మోగిపోద్ది అంటూ వచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ని మోత మోగిస్తోంది. విడుదలైన గంటలోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆయేషా ఖాన్ ఇటీవల ‘ఓం భీమ్ బుష్’ మూవీలో మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మోతపోద్దీ సాంగ్ తో ఫ్యాన్స్ కి షాకిచ్చింది. లిరిక్స్, స్టెప్స్, టేకింగ్ అంతా మాస్ అంటే ఇది అనేలా ఉంది. ముఖ్యంగా ఆయేషా- విశ్వక్ డాన్స్, కెమిస్ట్రీ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఈ సాంగ్ కి యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే అకాడమీ అవార్డు విన్నర్ చంద్రబోస్ అందించిన లిరిక్స్ అయితే కుర్రాళ్లను స్టెప్పులేయిస్తున్నాయి. అలాగే ఎంఎం మానసి వాయిస్ లో ఈ సాంగ్ విన్నాక ఆడియన్స్ అంతా థియేటర్లో ఈ సాంగ్ మోత మోగిపోద్ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మేకర్స్ ముందుగానే చెప్పినట్లు ఈ మోతమోగిపోద్ది సాంగ్ మాస్ బీట్ ఆఫ్ ది ఇయర్ లాగానే ఉంది. ఈ సాంగ్ తర్వాత ఆయేషా ఖాన్ కు తెలుగులో అభిమానులు పెరిగిపోతారు. అభిమాన సంఘాలు పుట్టుకొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంక ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే.. గోదావరి జిల్లాల నేపథ్యంలో జరిగే సినిమా అని టైటిల్ చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. ఇందులో నేహాశెట్టి- విశ్వక్ లవ్ ట్రాక్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది అంటున్నారు. ఎట్టకేలకు ఈ మూవీని మే 17న అయితే రిలీజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరి.. మాస్ కా దాస్ విశ్వక్- అయేషా ఖాన్ మాస్ బీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి