iDreamPost

YSRCP సీనియర్ నేత కన్నుమూత.. సంతాపం తెలిపిన కీలక నేతలు..

YSRCP సీనియర్ నేత కన్నుమూత.. సంతాపం తెలిపిన కీలక నేతలు..

ఇటీవల సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ కారణాలతో పలువురు ప్రముఖు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలు, గుండె పోటు, ఆత్మహత్య, అనారోగ్య కారణాలతో ప్రముఖులు మరణిస్తున్నారు. ఇటీవలే పటాన్ చెరువు ఎమ్మెల్యే కుమారుడు అనారోగ్య సమస్యతో మరణించారు. అలానే ఏపీలో కూడా మాజీ ప్రజాప్రతినిధులు మరణించారు. ఇలా వీరి మరణాలతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు విషాదంలో మునిగిపోతారు. తాజాగా విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కన్నుమూశారు. జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్ తుంపాల అప్పారావు  మరణించారు.

విశాఖపట్నం జిల్లా సబ్బవరం జెడ్పీటీసీ సభ్యుడిగా తుంపాల అప్పారావు ఎన్నికయ్యారు. అనంతరం విశాఖ పట్నం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గా కూడా ఎంపికయ్యారు. ఆయన కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గోపాలపట్నలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఆరోగ్యం విషమించి మృతిచెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మర్రిపాలెం వెళ్లి అప్పారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సోమవారం అప్పారావు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక ఆయన రాజకీయ ప్రస్థానం చూసినట్లు అయితే..విశాఖ పట్నం జిల్లా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. విశాఖ జిల్లా ఎల్లుప్పి శివారు మర్రిపాలెం గ్రామానికి చెందిన తుంపాల అప్పారావు మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తొలుత కాంగ్రెస్‌‌లో ఉన్నారు. 2009లో వైఎస్‌ రాజశేఖరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్‌సీపీలో చేరారు. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో సబ్బవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి.. విజయం సాధించారు. అనంతరం జిల్లా పరిషత్‌ వైస్ ఛైర్మన్‌ గా ఆయనకు అవకాశం లభించింది. అప్పారావుకు భార్య పార్వతి, కుమారులు ప్రసాద్‌, సాయి ఉన్నారు. ఆయన మరణంతో వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర విషాదంలో ఉన్నారు. మరి.. ఆయన మృతికి మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి