iDreamPost
android-app
ios-app

ఓటమిలోనూ స్పిరిట్‌ కొనసాగించిన టీమిండియా! అతనికే బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డ్‌

  • Published Nov 20, 2023 | 11:37 AMUpdated Nov 20, 2023 | 11:37 AM

వరల్డ్‌ కప్‌ గెలవాలన్న టీమిండియా ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లింది. 2003లో ఇదే ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడి ఓడిపోయిన టీమిండియా.. ఇప్పుడు రివేంజ్‌ తీర్చుకుంటుందని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. ఇంత బాధలో కూడా టీమిండియా మంచి స్పోర్టింగ్‌ స్పిరిట్‌ను చూపించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

కోట్ల మంది ఆశలు ఆవిరయ్యాయి. మూడు సారి ప్రపంచ కప్‌ గెలిచి.. టీమిండియా విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశపడిన వారంతా నిరాశకు గురయ్యారు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన భారత జట్టు.. ఫైనల్‌ పోరులో మాత్రం చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే.. ఈ టోర్నీలో టీమిండియా ఓడిపోయిన ఒకే ఒక్క మ్యాచ్‌ ఫైనల్ మాత్రమే. కాగా, ఈ టోర్నీ ఆరంభం నుంచి టీమిండియా ఓ సాంప్రదాయం కొనసాగిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో మంచి ఫీల్డింగ్‌ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్‌కు జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఓ మెడల్‌ను అందిస్తున్నారు.

ఇన్ని రోజులు అన్ని మ్యాచ్‌లు గెలుస్తూ.. ఎంతో సంతోషంగా ఈ బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ ప్రజెంటింగ్‌ సర్మనీని సెలబ్రేట్‌ చేసుకున్న టీమిండియా.. ఆదివారం ఓటమి భారంతో జరుపుకుంది. జట్టులోని ఆటగాళ్లంతా తీవ్ర నిరాశలో కుప్పకూలి కూర్చోగా.. ఫీల్డింగ్‌ కోచ్‌ టీ.దిలీప్‌.. బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ మంచి ఫీల్డింగ్‌ చేయడంతో పాటు తన ఎనర్జీతో జట్టులోని ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతూ.. జట్టు కోసం తన హండ్రెడ్‌పర్సెంట్‌ ఎఫర్ట్‌ అవ్వడంతో ఈ మెడల్‌ను కోహ్లీకి అందజేస్తున్నట్లు దిలీప్‌ వెల్లడించాడు.

ఆ మెడల్‌ను విరాట్‌ కోహ్లీకి రవీంద్ర జడేజా అందచేశాడు. కాగా, కోహ్లీ ఇది రెండో బెస్ట్‌ ఫీల్డింగ్‌ మెడల్‌. ఇక టోర్నీలో ఇదే చివరి మెడల్‌ కూడా. అయితే.. ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా కోహ్లీకే ఈ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఇక టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన కోహ్లీకి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు సైతం వరించింది. ఈ టోర్నీలో కోహ్లీ 765 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ వరల్డ్ కప్‌ టో​ర్నీలోనూ ఒక బ్యాటర్‌ ఇన్ని పరుగులు చేయలేదు. 2003లో సచిన్‌ టెండూల్కర్‌ చేసిన 673 పరుగులు రికార్డును కోహ్లీని ఈ వరల్డ్‌ కప్‌లో బ్రేక్‌ చేసి.. సరికొత్త రికార్డును నిలబెట్టాడు. మరి కోహ్లీకి చివరి బెస్ట్‌ ఫీల్డింగ్‌ మెడల్‌ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి