iDreamPost

Virat Kohli: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ సిరీస్ కు కోహ్లీ పూర్తిగా దూరం?

టీమిండియాకు.. దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పడు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ కు పూర్తిగా దూరం కానున్నాడని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియాకు.. దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పడు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ కు పూర్తిగా దూరం కానున్నాడని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

Virat Kohli: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ సిరీస్ కు కోహ్లీ పూర్తిగా దూరం?

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఓటమి బాధనుంచి కోలుకోని టీమిండియాకు.. దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా రెండో టెస్ట్ కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆందోళన చెందుతున్న అభిమానులకు మరో గుండె పగిలే న్యూస్ అందింది. వ్యక్తిగత కారణాల చేత తొలి మ్యాచ్ కు అందుబాటులో లేని విరాట్ కోహ్లీ.. తర్వాత మ్యాచ్ లకు జట్టుతో కలుస్తాడని అందరూ భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంగ్లాండ్ తో జరిగే పూర్తి సిరీస్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గాయాలతో స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు రెండో టెస్ట్ కు దూరం అయ్యారు. అయితే వారు తర్వాత మ్యాచ్ లకు కూడా అందుబాటులోకి వస్తారా? రారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. భారత రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ సైతం ఇంగ్లాండ్ తో జరగబోయే మిగతా టెస్ట్ మ్యాచ్ లకు దూరం కానున్నాడని తెలుస్తోంది. అంటే ఈ సిరీస్ కు మెుత్తానికి కోహ్లీ అందుబాటులో ఉండడన్న మాట. విరాట్ జట్టుతో కలవకపోవడానికి ఓ కారణం ఉంది. కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, దీంతో ఆమెను దగ్గరుండి చూసుకునేందుకునే విరాట్ ఇంగ్లాండ్ సిరీస్ మెుత్తానికి దూరం కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

Kohli distance to England series

ఒకవేళ ఇదేగనక నిజమైతే.. భారత జట్టు కష్టాలు ఎదుర్కొక తప్పదు. ఇప్పటికే సిరీస్ లో 1-0తో వెనకపబడి ఉండగా.. ఇప్పుడు కోహ్లీ కూడా దూరమైతే.. టీమ్ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కాగా.. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అందుకోసం ఇప్పటికే ఇరు జట్టు అక్కడి చేరుకుని ప్రాక్టీస్ మెుదలుపెట్టాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇదిలా ఉండగా.. చివరి మూడు టెస్ట్ లకు ఇవాళ(బుధవారం జనవరి 31న) టీమ్ ను ప్రకటిస్తారని సమాచారం. అయినప్పటికీ విరాట్ నుంచి ఇప్పటి వరకు తమకు సమాచారం అందలేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి